‘సారీ కోహ్లీ’... పదేళ్ల రికార్డు బద్దలు కొట్టిన శుభ్ మన్ గిల్

By telugu teamFirst Published Nov 4, 2019, 4:20 PM IST
Highlights

ఇండియా-సీకి శుభ్ మన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. దీంతో అతి తక్కువ వయసులో దేవధర్ ట్రోఫీ ఫైనల్స్ లో ఓ జట్టుకి నాయకత్వం వహించిన ఆటగాడిగా శుభ్ మన్ నిలిచాడు. అంతకముందు 2009-10లో నార్త్ జోన్ కు సారథ్యం వహించిన ఘనత విరాట్ కోహ్లీకి దక్కింది.

టీమిండియా విరాట్ కోహ్లీకి రికార్డుల రారాజు అనే బిరుదు ఉంది. అత్యధిక రికార్డులను తన  జాబితాలో వేసుకొని ముందుకు దూసుకుపోతున్నాడు. అలాంటి కోహ్లీ రికార్డును యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ బ్రేక్ చేసి అరుదైన ఘనత సాధించాడు. పదేళ్ల క్రితం విరాట్ సాధించిన రికార్డును తాజాగా శుభ్ మన్ గిల్ బద్దలు కొట్టాడు.

ప్రస్తుతం 47వ దేవధర్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... సోమవారం ఇండియా-సి, ఇండియా-బి ఫైనల్స్ లో తలపడ్డాయి. ఇండియా-సీకి శుభ్ మన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. దీంతో అతి తక్కువ వయసులో దేవధర్ ట్రోఫీ ఫైనల్స్ లో ఓ జట్టుకి నాయకత్వం వహించిన ఆటగాడిగా శుభ్ మన్ నిలిచాడు. అంతకముందు 2009-10లో నార్త్ జోన్ కు సారథ్యం వహించిన ఘనత విరాట్ కోహ్లీకి దక్కింది.

అయితే... ఆ సమయంలో కోహ్లీ వయసు 21ఏళ్ల 142 రోజులు కాగా... ప్రస్తుతం శుభ్ మన్ వయసు 20ఏళ్ల 57 రోజులు కావడంగమనార్హం, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ తర్వాత ఆ ఘనత ఉన్ముక్త్ చంద్(22 సంవత్సరాల 310 రోజులు), శ్రేయాస్ అయ్యర్(23ఏళ్ల 92రోజులు), మనోజ్ తివారి(23ఏళ్ల 124 రోజులు), కపిల్ దేవ్ (23ఏళ్ల 305 రోజులు)లు సాధించారు. వీరందరూ కూడా అతి పిన్నవయసులోనే దేవధార్ ట్రోఫీ కెప్టెన్స్ గా వ్యవహరించారు.

అయితే... శుభ్ మన్ గిల్ రికార్డు అయితే సాధించాడు కానీ... ఆటలో మాత్రం కాస్త తడపడ్డాడు. ఈ సీజన్ మొత్తం ఫుల్ ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్... రికార్డు సాధించిన రోజు మాత్రం కేవలం ఒకే ఒక్క పరుగు చేయడం గమనార్హం. దక్షిణాఫ్రికా ఏపై 2 ఫస్టక్లాస్ మ్యాచుల్లో 187 పరుగులు చేయగా...  దేవధర్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో ఇండియా ఏపై 147 పరుగులు చేశాడు.
 

click me!