ఐసీసీ పురుషుల ప్రపంచకప్ క్రికెట్ టైటిల్ ను అస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఈ ట్రోఫీపై అస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.ఈ విషయమై ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
న్యూఢిల్లీ: అస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆర్‌టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ అలిఘర్ ఢిల్లీ గేట్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ క్రికెట్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫోటో పై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ విషయమై ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ గేట్ పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రపంచకప్ క్రికెట్ ట్రోఫీపై కాళ్లు పెట్టి వందకోట్లకు పైగా భారతీయుల గౌరవాన్ని కూడ మిచెల్ మార్ష్ అవమానించారని కేశవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు కూడ ఆయన ఫిర్యాదు చేశారు.
నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లో అస్ట్రేలియా, భారత జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై అస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ ను అస్ట్రేలియా టీమ్ దక్కించుకుంది. ఈ ట్రోఫిపై అస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది.
ఒక చేతిలో బీరు బాటిల్ పట్టుకొని రెండు కాళ్లను వరల్డ్ కప్ ట్రోఫీపై మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టిన ఫోటో పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. ఈ విషయమై సమాచార హక్కు కార్యకర్త మిచెల్ మార్ష్ పై ఢిల్లీ గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా మిచెల్ మార్ష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారత జట్టు ఫైనల్ మినహా అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్, పీల్డింగ్ లలో భారత జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. దీంతో అస్ట్రేలియా జట్టు భారత్ పై విజయం సాధించింది. ఫైనల్ లో విజయం సాధిస్తే భారత్ జట్టుకు మూడు ప్రపంచకప్ లు దక్కేవి. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో రెండు ప్రపంచ కప్ లు భారత్ కు దక్కాయి. అయితే అస్ట్రేలియాపై ఓటమితో మూడోదఫా కప్ ఆశలు గల్లంతయ్యాయి. భారత్ జట్టుపై విజయం సాధించడంతో అస్ట్రేలియా జట్టు ఆరు దఫాలు ప్రపంచకప్ ను దక్కించుకుంది.
ఇదిలా ఉంటే ప్రపంచకప్ పోటీలు ముగిశాయి.అయితే అస్ట్రేలియా, భారత జట్ల మధ్య ఐదు టీ 20 క్రికెట్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటికే ఒక్క వన్ డే మ్యాచ్ పూర్తైంది.ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.