భారత్‌లో భారత్‌ను ఓడించడం మాకే సాధ్యం.. కలలకూ హద్దుండాలి అంటూ పాక్ అభిమానికి రిప్లై ఇచ్చిన ఆకాశ్ చోప్రా

Published : Feb 10, 2023, 03:31 PM ISTUpdated : Feb 10, 2023, 03:32 PM IST
భారత్‌లో భారత్‌ను ఓడించడం మాకే సాధ్యం.. కలలకూ హద్దుండాలి అంటూ పాక్ అభిమానికి రిప్లై ఇచ్చిన ఆకాశ్ చోప్రా

సారాంశం

ఆసీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వల్ల కానిది తాము చేసి చూపిస్తామంటున్నాడు ఓ పాకిస్తాన్ అభిమాని. భారత్ లో భారత్ ను ఓడించే సత్తా  పాకిస్తాన్ కు ఉందని అంటున్నాడు. 

భారత్ లో భారత్ ను ఓడించడం అనేది   అంత ఈజీ కాదు.   ఆ విషయం  అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా నుంచి టెస్టు  క్రికెట్ లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న  చిన్న జట్లకూ తెలుసు. విదేశాల్లో మన ప్రదర్శన ఎలా ఉన్నా స్వదేశంలో భారత్ ను ఓడించడం అనేది శక్తికి మించిన పని.  ఆస్ట్రేలియా.. 19 ఏండ్లుగా  భారత్ లో భారత్ ను ఓడించాలని  కలలు కంటూనే ఉంది.  కానీ అవి కలలుగానే మిగిలిపోతున్నాయి.  

అయితే  ఆసీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వల్ల కానిది తాము చేసి చూపిస్తామంటున్నాడు ఓ పాకిస్తాన్ అభిమాని. భారత్ లో భారత్ ను ఓడించే సత్తా  పాకిస్తాన్ కు ఉందని   అంటున్నాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆకాశ్ చోప్రా  ట్విటర్ లో  ఓ ఒపినీయర్ పోల్ పెట్టగా పాకిస్తాన్ కు చెందిన ఓ అభిమాని ఇలా ట్వీట్ చేశాడు. 

తల్లా (తల్లాహెజాజ్) అని పేరు ఉన్న   ఓ  ట్విటర్ యూజర్ తన ఖాతాలో  ‘భారత్ లో భారత్ ను  ఓడించే సామర్థ్యం ఒక్క పాకిస్తాన్ కు మాత్రమే ఉంది...’అని  ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు   టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం క్రికెట్  వ్యాఖ్యాతగా సేవలందిస్తున్న  ఆకాశ్ చోప్రా అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. 

 

తల్లా  ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ.. ‘నీ పాజిటివిటీ చూస్తుంటే ముచ్చటేస్తుంది సోదరా.. కానీ  నువ్వు అసలు విషయం మరిచిపోయినట్టున్నావ్.  ముందు పాకిస్తాన్.. వారి స్వదేశంలో సిరీస్ గెలవనియి.  ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతిలో  స్వదేశంలోనే మీరు చావుదెబ్బ తిన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లలో దారుణంగా ఓడారు.  ఈ సిరీస్ లలో మీరు గెలిచుంటే ఇప్పటికే పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు  చేరుకుని ఉండేది..’అని  రిప్లై ఇచ్చాడు. 

 

చోప్రా ట్వీట్  ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  చోప్రా ట్వీట్ కు టీమిండియా ఫ్యాన్స్ కూడా స్పందించారు.  ‘అవును చోప్రా భయ్యా.. కరెక్ట్ గా చెప్పారు..  విదేశీ జట్లు  వాళ్ల దేశానికి వస్తే సిమెంట్ రోడ్లున్న పిచ్ లను తయారుచేసి  అబాసుపాలవుతున్న  పాకిస్తాన్ మనకు నీతులు చెబుతోంది...’అంటూ కామెంట్ చేస్తున్నారు.  టీమిండియా ఫ్యాన్స్ తో పాటు పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా  ఆకాశ్ చోప్రా ట్వీట్ కు ఇంప్రెస్ అవడం గమనార్హం. కాగా ఇరు దేశాల మధ్య  సరిహద్దు సమస్యలతో 2011 నుంచి ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదన్న సంగతి తెలిసిందే. ఐసీసీ, ఆసియా కప్ లల ోమాత్రమే రెండు దేశాల ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !