ఐదో స్థానంలోనూ అదరగొట్టేశాడు.. కత్తి కంటే పదునైనోడు: రాహుల్‌పై కైఫ్

By Siva KodatiFirst Published Feb 5, 2020, 9:28 PM IST
Highlights

న్యూజిలాండ్‌‌‌తో సిరీస్‌తో మొదటి నుంచి అద్బుతమైన ఫామ్ కొనసాగిస్తున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు తొలి వన్డేలోనూ అద్భుతంగా ఆడారు. శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయగా.. రాహుల్ ఐదో స్థానంలో వచ్చి 64 బంతుల్లో 88 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్‌‌‌తో సిరీస్‌తో మొదటి నుంచి అద్బుతమైన ఫామ్ కొనసాగిస్తున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు తొలి వన్డేలోనూ అద్భుతంగా ఆడారు. శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయగా.. రాహుల్ ఐదో స్థానంలో వచ్చి 64 బంతుల్లో 88 పరుగులు చేశాడు.

రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడంతో రాహుల్ ఐదో స్థానంలో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. రాహుల్ ఆడిన మ్యాచ్‌ల్లో స్థానాలు మారుతున్నాయే తప్పించి తన ఆటతీరు మాత్రం మారలేదు.

Also Read:అసలే ఓటమి ఆపై టీమిండియాకు మరో షాక్: భారీ జరిమానా విధించిన ఐసీసీ

ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో లోకేశ్ ‌రాహుల్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కేఎల్ రాహుల్ కత్తి కంటే చాలా పదనుగా ఉన్నాడు.

ఏ స్థానంలో ఆడినా సరే రెచ్చిపోతున్నాడు.. అతని ఆటతీరును ఇలాగే కొనసాగించాలని తాను కోరుకుంటున్నా అని కైఫ్ ట్వీట్ చేశాడు. కాగా హామిల్టన్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై కివీస్ 4 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ మరో 11 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది.

Also Read:కివీస్ విజయంలో కీలకపాత్ర: మన బుమ్రానేనా అంటున్న ఫ్యాన్స్

రాస్ టేలర్ 109 నాటౌట్‌ ధాటిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించి.. వరుస ఓటములకు బ్రేక్ వేశాడు. భారత ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ లోపాలతో మ్యాచ్‌ను చేజార్చుకున్నామన్నాడు. టామ్ లేథన్, రాస్ టేలర్‌లు బాగా ఆడారని కోహ్లీ ప్రశంసించాడు. 

click me!