రహానే పై విమర్శలు.. మద్దతుగా కోచ్ విక్రమ్ రాథోడ్..!

By telugu news teamFirst Published Sep 6, 2021, 1:28 PM IST
Highlights

. రహానేపై విమర్శలు ఎక్కువయ్యాయి. నెటిజన్లు సైతం ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. టీమిండియా కోచ్ విక్రమ్ రాథోడ్ రహానేకి మద్దుతగా నిలిచాడు.

టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో పూర్తిగా విఫలయ్యాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో రహానే డకౌట్‌గా వెనుదిరిగాడు. వోక్స్‌ వేసిన బంతి ఇన్‌స్వింగ్‌ అయి రహానే ప్యాడ్లను తాకడంతో అప్పీల్‌ చేశాడు. అది క్లీన్‌ ఔట్‌ అని తేలడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. అయితే తన ఔట్‌పై సందేహం వచ్చిన రహానే రివ్యూ కోరాడు. అప్పటికి కోహ్లి రివ్యూకు వెళ్లొద్దని రహానేకు చెప్పినా వినిపించుకోలేదు. రివ్యూలోనూ అదే ఫలితం పునరావృతం కావడంతో రహానే నిరాశగా వెనుదిరిగాడు.

దీంతో.. రహానేపై విమర్శలు ఎక్కువయ్యాయి. నెటిజన్లు సైతం ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. టీమిండియా కోచ్ విక్రమ్ రాథోడ్ రహానేకి మద్దుతగా నిలిచాడు.

 రహానే మంచిగా రావడానికి కష్టపడుతున్నాడని, అతని ఫామ్ గురించి చింతించాల్సిన సమయం ఇంకా రాలేదని విక్రమ్ రాథోడ్  చెప్పాడు. రహానే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడని గుర్తు  చేశారు.
‘‘అజింక్యా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని మేము ఆశిస్తున్నాము మరియు అతను ఇంకా భారత జట్టు బ్యాటింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తాడని మేము ఆశిస్తున్నాము, కాబట్టి మేము ఆందోళన చెందాల్సిన స్థితికి చేరుకున్నామని నేను అనుకోను.’’అని విక్రమ్ రాథోడ్ పేర్కొన్నారు.

click me!