ఇండియా టూర్‌కి ముందు లంకను ఆరేసిన అండర్సన్... 38 ఏళ్ల వయసులో రికార్డు...

Published : Jan 23, 2021, 03:16 PM IST
ఇండియా టూర్‌కి ముందు లంకను ఆరేసిన అండర్సన్... 38 ఏళ్ల వయసులో రికార్డు...

సారాంశం

శ్రీలంకపై రెండో టెస్టులో ఆరు వికెట్లు తీసిన జేమ్స్ అండర్సన్... 38 ఏళ్ల వయసులో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి పేసర్‌గా రికార్డు... 20 ఏళ్ల తర్వాత పేస్ బౌలింగ్‌లోనే పదికి పది వికెట్లు కోల్పోయిన లంక...

ప్రస్తుతం శ్రీలంక రెండో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు, వచ్చే నెలలో టీమిండియాతో కలిసి నాలుగు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు.

మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లు బౌలింగ్ చేసిన అండర్సన్, 13 మెయిడిన్లు వేసి, కేవలం 40 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతి పెద్ద వయసులో ఐదు వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు అండర్సన్. ఇంతకుముందు ఈ రికార్డు రిచర్డ్ హార్డ్‌లీ పేరిట ఉంది.

20 ఏళ్ల తర్వాత శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు మొత్తం పేసర్లకే దక్కడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకి ఆలౌట్ అయ్యింది శ్రీలంక. ఏజెంలో మాథ్యూస్ 110 పరుగులు చేయగా డిక్‌వాలా 92, దిల్ పెరేరా 67, దినేష్ చండిమల్ 52 పరుగులు చేశారు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు