కుటుంబంతో సహా వచ్చేందుకు అనుమతించని ఆస్ట్రేలియా... రవిశాస్త్రి చెప్పిన ఒక్కే ఒక్క మాటతో...

By team teluguFirst Published Jan 23, 2021, 9:04 AM IST
Highlights

టూర్ ఆరంభానికి ముందు ఫ్యామిలీలకు నో ఎంట్రీ అని చెప్పిన ఆస్ట్రేలియా...

ఆస్ట్రేలియాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కోచ్ రవిశాస్త్రి....

నా కంటే ఆస్ట్రేలియా గురించి ఎవ్వరికీ బాగా తెలీదంటూ కూల్ వార్నింగ్...

హుటాహుటిన రూల్స్ మార్చిన క్రికెట్ ఆస్ట్రేలియా...

భారత క్రికెట్ కోచ్ రవిశాస్త్రిని ట్రోల్ చేస్తూ ఓ ఆటాడుకుంటారు కానీ అప్పుడప్పుడు అతను చేసే కొన్ని పనులు తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆస్ట్రేలియా టూర్‌కి ముందు ఒకే ఒక్క మాట, ఆసీస్‌‌కి చెక్ పెట్టాడట రవిశాస్త్రి. యూఏఈలో ఐపీఎల్ ముగించుకున్న తర్వాత ఆస్ట్రేలియా వెళ్లేందుకు క్వారంటైన్‌లో గడుపుతున్న భారత జట్టుకి, క్రికెట్ ఆస్ట్రేలియా ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది.

ఆసీస్‌కి బయలుదేరే ఒక రోజు ముందు, క్రికెటర్ల ఫ్యామిలీలకు అనుమతి లేదని, కేవలం క్రికెటర్లు, సహాయ సిబ్బంది మాత్రమే ఆస్ట్రేలియాకి రావాలని చెప్పింది సీఏ.దీంతో కుటుంబాలతో ఉన్న ఏడుగురు భారత క్రికెటర్లు అయోమయానికి గురయ్యారు.

అప్పుడు కోచ్ రవిశాస్త్రి... ‘ఫ్యామిలీలకు అనుమతి లేకపోతే... మేం ఆస్ట్రేలియాకే రాం. ఏం చేస్తారో చేసుకోండి... నాకంటే ఆస్ట్రేలియా గురించి ఎవ్వరికీ ఎక్కువ తెలీదు. 40 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నా... ఎవ్వరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు...’ అంటూ స్పష్టం చేశాడట.

దాంతో ఆస్ట్రేలియా రాత్రికి రాత్రి రూల్స్ మార్చి, కుటుంబాలను కూడా తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చిందట. ఈ విషయాన్ని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించాడు. 

click me!