ENG vs IND: టాస్ నెగ్గిన రోహిత్.. టీమిండియాదే బ్యాటింగ్..

Published : Jul 07, 2022, 10:10 PM ISTUpdated : Jul 07, 2022, 10:15 PM IST
ENG vs IND: టాస్ నెగ్గిన రోహిత్.. టీమిండియాదే బ్యాటింగ్..

సారాంశం

ENG vs IND T20I: ఎడ్జబాస్టన్ టెస్టులో ఓటమి పాలై నిరాశలో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ వేదికగా దొరికింది. సౌతాంప్టన్ వేదికగా నేడు ఇండియా-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 జరగనుంది. 

భారత్-ఇంగ్లాండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో  రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్ ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా.. టీ20లలో గెలిచి దానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. ఆ మేరకు టీమిండియాకు ఇది తొలి అవకాశం. ఎడ్జబాస్టన్ టెస్టులో కరోనా కారణంగా ఆడలేకపోయిన టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాడు. 

ఇక దాదాపు ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ లోనూ ఆడిస్తున్నారు. కానీ వీరికి  రోహిత్ శర్మ యాడ్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున అర్ష్దీప్ సింగ్ అరంగేట్రం చేస్తున్నాడు. కానీ సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లను పక్కనబెట్టింది టీమ్ మేనేజ్మెంట్. 

 

జట్లు : 

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ 

ఇంగ్లాండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, హారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లే, మాథ్యూ పార్కిన్సన్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు