అండర్ కవర్ ప్రేక్షకులు..! వాళ్ల బెండు తీయడానికి ఈసీబీ కొత్త ప్లాన్.. చిక్కినోళ్లు బొక్కలోకే..

Published : Jul 07, 2022, 09:27 PM ISTUpdated : Jul 07, 2022, 09:31 PM IST
అండర్ కవర్ ప్రేక్షకులు..! వాళ్ల బెండు తీయడానికి ఈసీబీ కొత్త ప్లాన్.. చిక్కినోళ్లు బొక్కలోకే..

సారాంశం

ENG vs IND: ఎడ్జబాస్టన్ టెస్టులో  ఇంగ్లాండ్ పరువు తీసే విధంగా  వ్యవహరించిన  ఇంగ్లీష్ అభిమానుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మేల్కొంది. 

మీరు అండర్ కవర్  పోలీసులు, అండర్ కవర్ ఏజెంట్ల గురించి విని ఉంటారు. కానీ అండర్ కవర్ ప్రేక్షకుల గురించి ఎప్పుడైనా విన్నారా..? కానీ త్వరలోనే వాళ్లు ప్రత్యక్షం కాబోతున్నారు. పోలీసులు, ఏజెంట్లు అయితే కీలక సమాచారం సేకరించడమో లేదా ఏదైనా మిస్టరీని ఛేదించడమో చేస్తారు కదా..  మరి ఈ అండర్ కవర్ ప్రేక్షకులు ఏం చేస్తారు..? అనేగా మీ అనుమానం.  అసలేంటి ఈ అండర్ కవర్ అభిమానుల కథ..? అనేది ఇక్కడ చూద్దాం.  

స్టేడియలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చే అభిమానులు వచ్చామా.. మ్యాచ్ ను ఎంజాయ్ చేశామా.. వెళ్లామా.. అన్నట్టు ఉంటే ఏ గొడవా ఉండదు. కానీ స్టేడియంలో అభ్యంతరకర పనులు చేయడం.. ప్రత్యర్థి  దేశాల క్రికెట్ అభిమానులపై ఇష్టమొచ్చినట్టు వాగడం.. గ్రౌండ్ లో గలాటా సృష్టించేవారితోనే అసలు సమస్య. ఇదిగో ఇలాంటి వాళ్ల బెండు తీయడానికి ఈసీబీ వేసిన కొత్త ఎత్తుగడే అండర్ కవర్ ప్రేక్షకులు. క్రికెట్ లో ఇది కొత్తే అయినా ఫుట్బాల్ లీగ్ లలో ఇది ఎప్పట్నుంచో అమల్లో ఉంది. గ్రౌండ్ లో అభిమానులతో కలిసిపోయే వీళ్లు.. అభ్యంతరకరంగా ఉన్నవారి బెండు తీస్తారు. 

ఏం చేస్తారు..? 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రెండ్రోజుల క్రితం ఎడ్జబాస్టన్ వేదికగా ముగిసిన టెస్టులో పలువురు ఇంగ్లీష్ అభిమానులు భారత క్రికెట్ ఫ్యాన్స్ ను లక్ష్యంగా చేసుకుని జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రంగు, జాతి ఆధారంగా భారత అభిమానులను దూషించారు. దీనిపై భారత క్రికెట్ అభిమానులు ఈసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈసీబీ  నిందితులను కనిపెట్టేందుకు ఈ కొత్త ఎత్తుగడ వేసింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నుంచే ఈ అండర్ కవర్ ప్రేక్షకుల ఆపరేషన్ ప్రారంభం కానుంది. వీళ్లు కూడా అందరు ప్రేక్షకుల మాదిరే వచ్చి స్టేడియంలో అక్కడొకరు అక్కడొకరు కలిసిపోతారు. వారి సమీపంలో ఎవరైనా ఇతర దేశాల ఫ్యాన్స్ పై గానీ, ఆటగాళ్ల పై గానీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా.. స్టేడియంలో డ్రగ్స్ వాడటం వంటివి చేస్తే వాళ్లను గుర్తిస్తారు. నిందితులను పోలీసులకు అప్పగించి వారికి చేయాల్సిన సపర్యలు చేస్తారని ఈసీబీ వర్గాలు తెలిపాయి. 

 

ఇదే విషయమై రెండో టీ20 జరుగబోయే వార్విక్షైర్ (ఎడ్జబాస్టన్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువర్ట్ కేన్ మాట్లాడుతూ.. ‘ఇటీవల ముగిసిన ఇండియా-ఇంగ్లాండ్ టెస్టును సుమారు లక్ష మంది స్టేడియానికి వచ్చి వీక్షించారు. కానీ కొంతమంది కారణంగా దేశ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందంటే మేం దానిని ఉపేక్షించం.. ఆటలో దానికి (రేసిజం)   ఆస్కారమే లేదు. కొంతమంది వల్ల ఆటకు, దేశానికి చెడ్డపేరు రావడం కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ల మీద కఠినంగా వ్యవహరించనున్నాం. మ్యాచ్ చూడటానికి వచ్చినోళ్ల భద్రత కూడా మాకు ముఖ్యం..’ అని తెలిపాడు. చివరి టెస్టుల రేసిజం వ్యాఖ్యలకు నొచ్చుకున్నవారికి ఆయన క్షమాపణలు చెప్పడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు