అనుష్కను కలవకుంటే నేను ఎక్కడ ఉండేవాడ్నో.. విరాట్ కోహ్లీ

Published : Aug 11, 2021, 08:43 AM IST
అనుష్కను కలవకుంటే నేను ఎక్కడ ఉండేవాడ్నో.. విరాట్ కోహ్లీ

సారాంశం

2013లో తొలిసారి.. ఓ యాడ్ షూటింగ్ లో కోహ్లీకి అనుష్క పరిచయం అయ్యిందట. ఆ తర్వాత వీరు డేటింగ్ చేయడం ప్రారంభించారు, అదే ప్రేమగా మారి.. చివరకు పెళ్లికి దారి తీసింది,  

టీమిండియా విరాట్ కోహ్లీ.. వరల్డ్ బెస్ట్ క్రికెటర్లలో ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉన్నారు. అన్ని రకాల ఫార్మాట్ లలోనూ కోహ్లీ అదరగొట్టగలడు. బ్యాట్ పట్టాడంటే పరుగుల వర్షం కురిపిస్తాడు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా.. రన్ మెషిన్ అని కూడా పిలుచుకుంటారు.

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే..  కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరికి వివాహం కాగా... ఈ ఏడాది మొదట్లో వీరికి ఓ పాప జన్మించింది. కాగా.. తన కెరీర్ ఇలా ఆనందంగా ముందుకు సాగడానికి.. తన విజయానికి తన భార్య అనుష్క నే కారణమంటూ తాజాగా కోహ్లీ వివరించాడు,

క్రికెటర్ దినేష్ కార్తీక్ చేసిన ఇంటర్వ్యూలో కోహ్లీ అనుష్క గురించి చాలా గొప్పగా పేర్కొనడం విశేషం,.  2013లో తొలిసారి.. ఓ యాడ్ షూటింగ్ లో కోహ్లీకి అనుష్క పరిచయం అయ్యిందట. ఆ తర్వాత వీరు డేటింగ్ చేయడం ప్రారంభించారు, అదే ప్రేమగా మారి.. చివరకు పెళ్లికి దారి తీసింది,

కాగా.. తన జీవితంలోకి అనుష్క రాకపోయి ఉంటే.. తాను అసలు ఎక్కడ ఉండేవాడినో కూడా తనకు తెలీదంటూ కోహ్లీ పేర్కొనడం విశేషం. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి అనుష్కనే కారణమన్నాడు. తాను ఎక్కడ ఎలా ఇంపాక్ట్ అవుతానో తనకే ఎక్కువ తెలుసన్నాడు. తన పక్కన ఉంటే తనకు రిలీఫ్ గా ఉంటుందన్నాడు.  ఆమె లాంటి జీవిత భాగస్వామి తనకు దొరకడం .. తన అదృష్టమని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇక తన కుమార్తె వామిక గురించి మాట్లాడుతూ... వామిక కోసం తమ షెడ్యూల్ చాలా బిజీగా మార్చుకున్నామని చెప్పాడు. వామిక ప్రశాంతంగా నిద్రపోవడానికి తాము చాలా ప్రయత్నిస్తామన్నాడు. బ్రేక్ ఫాస్ట్ కి వెళ్లినా.. త్వరత్వరగా.. కాఫీ తాగేసి వెంటనే రూమ్ కి వచ్చేస్తాం అంటూ కోహ్లీ చెప్పాడు. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే