నీతో అవసరం లేదు.. బుమ్రా ఇంట్రస్టింగ్ ట్వీట్..!

Published : Aug 10, 2021, 09:21 AM ISTUpdated : Aug 10, 2021, 09:23 AM IST
నీతో అవసరం లేదు.. బుమ్రా ఇంట్రస్టింగ్ ట్వీట్..!

సారాంశం

బుమ్రా స్పందిస్తూ.. తాను తన ఆట ఏమీ మార్చుకోలేదని.. కేవలం మైండ్ సెట్ మార్చుకున్నానని చెప్పడం గమనార్హం.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఘోరంగా విఫలమయ్యాడు. ఆ వైఫల్యంతో..  బుమ్రాపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే.. తాజాగా... ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో మాత్రం బుమ్రా.. అదరగొట్టాడు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో చెలరేగిన ఈ యార్కర్ల కింగ్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. దీంతో.. బుమ్రా పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ మ్యాచ్ లో అదరగొట్టిన తర్వాత.. బుమ్రా ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు.

‘నీతో అవసరం లేదు’అంటూ బుమ్రా ట్వీట్ చేశాడు. కాగా.. తన పాత ఆట ను ఉద్దేశించి బుమ్రా ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మ్యాచ్ తో.. అందరూ బుమ్రా ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. కాగా.. దీనిపై బుమ్రా స్పందిస్తూ.. తాను తన ఆట ఏమీ మార్చుకోలేదని.. కేవలం మైండ్ సెట్ మార్చుకున్నానని చెప్పడం గమనార్హం.

బుమ్రా ఆటపై కేఎల్ రాహుల్ కూడా స్పందించారు. బుమ్రా.. బెస్ట్ బౌలర్ అని పేర్కొన్నాడు. ఎప్పుడూ బుమ్రా అదరగొడుతూనే ఉంటాడని చెప్పాడు. బుమ్రా నెంబర్ వన్ బౌలర్ అంటూ కితాబు ఇచ్చాడు. బుమ్రా ఈజ్ బ్యాక్ అని ఎందుకు అంటున్నారో తనకు అర్థం కావడం లేదని.. ఎటు వంటి పరిస్థితుల్లో అయినా...బుమ్రా అదరగొడతాడని.. పరిస్థితులను తగినట్లు ఆడతాడని పేర్కొన్నారు. క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి బుమ్రా సూపర్ గా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే