IPL 2021 DC VS RR: ఢిల్లీ జోరుకు రాయల్స్ బ్రేక్ వేస్తుందా..? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Published : Sep 25, 2021, 03:20 PM IST
IPL 2021 DC VS RR: ఢిల్లీ జోరుకు రాయల్స్ బ్రేక్ వేస్తుందా..? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

సారాంశం

IPL 2021 DC VS RR: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో అత్యంత నిలకడగా ఆడుతున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals). మరోవైపు ఆడిన ఎనిమిది మ్యాచులలో సగం గెలిచి సగం ఓడి పడుతూ లేస్తున్న జట్టు రాజస్థాన్ రాయల్స్ (rajasthan royals). ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.  

అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్-14 (ipl 2021) రెండో దశలో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జోరు మీదున్న  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. మరో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మళ్లీ టాప్ ప్లేస్ ను నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. ఈ మ్యాచ్ లోనూ గెలిచి ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకోవాలని రాయల్స్ భావిస్తున్నది. ఇప్పటికే తొమ్మిది మ్యాచ్ లు ఆడి ఏడింటిలో గెలిచి రెండు ఓడిపోయిన ఢిల్లీ కుర్రాళ్లు..  రాయల్స్ ను ఓడించి ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సులభతరం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. 


రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఎవిన్ లూయిస్, క్రిస్ మోరిస్ లకు విశ్రాంతినివ్వగా.. వారి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు తజ్రిబ్ సామ్షి, డేవిడ్ మిల్లర్ తుది జట్టులోకి వచ్చారు. ఢిల్లీ జట్టులో మార్కస్ స్టోయినిస్ ప్లేస్ లో లలిత్ యాదవ్ చేరాడు. 

రెండు జట్లు ఐపీఎల్ లో 23 సార్లు తలపడగా..  మొగ్గు మాత్రం రాయల్స్ వైపే  ఉంది. 12 సార్లు రాజస్థాన్ గెలువగా 11 సార్లు ఢిల్లీ నెగ్గింది.  కాగా, అబుదాబిలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నెమ్మదిగా బ్యాటింగ్ కు అనుకూలించే ఈ పిచ్ పై చెలరేగాలని ఇరు జట్ల  ఆటగాళ్లు చూస్తున్నారు. 

జట్లు: 
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, షిమ్రాన్ హెట్మీర్, రిషబ్ పంత్ (c & wk), స్టీవ్ స్మిత్, అక్షర్ పటేల్, రబాడ, నార్త్జే, అవేశ్ ఖాన్, లలిత్ యాదవ్, ఆర్.అశ్విన్

రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, డేవిడ్ మిల్లర్, సంజూ శాంసన్ (c & wk), తజ్రిబ్ సామ్షి, లియామ్ లివింగ్ స్టోన్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లొమ్రర్, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 

PREV
click me!

Recommended Stories

Ishan Kishan: బ్యాంకు ఉద్యోగిగా మారిన టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్.. నెలకు జీతం ఎంతంటే?
Most Educated Cricketer : ధోనీ, కోహ్లీ, రోహిత్ కాదు.. టీమిండియాలో అత్యంత విద్యావంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?