IPL 2021: విరాట్-ధోనిల బ్రొమాన్స్.. మ్యాచ్ కు ముందు ఇరు జట్ల కెప్టెన్ల ముచ్చట్లు..

By team teluguFirst Published Sep 25, 2021, 11:56 AM IST
Highlights

MS DHONI & VIRAT KOHLI: ఆధునిక భారత క్రికెట్లో మేటి కెప్టెన్లు అనదగ్గవారిలో కచ్చితంగా వినిపించే పేర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి. ధోని నుంచి నాయకత్వ పగ్గాలు అందుకున్న కోహ్లి.. ఐసీసీ టోర్నీల్లో మినహా విదేశాల్లోనూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. కాగా ధోని, కోహ్లిల మధ్య బ్రొమాన్స్ మరోసారి చర్చనీయాంశమైంది.

భారత క్రికెట్ జట్టుకు విదేశాల్లో విజయాలు నేర్పించిన వారిలో గంగూలీ తర్వాత వినిపించే పేరు మహేంద్ర సింగ్ ధోని. ధోని నీడనే నాయకుడిగా ఎదిగిన కోహ్లి కూడా గురువుకు తగ్గ శిష్యుడనే అనిపించుకుంటున్నాడు. వీరిద్దరి రిలేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పన్లేదు. శుక్రవారం షార్జాలో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య మ్యాచ్ సందర్భంగా కూడా వీరి బ్రొమాన్స్ మరోసారి ఈ ఇద్దరి అభిమానులనూ ఖుషీ చేసింది. 

కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు షార్జాలో ఇసుక తుఫాను కారణంగా టాస్ పదినిమిషాల పాటు ఆలస్యమైంది. అంతకుముందే స్టేడియంలోకి చేరుకున్న ధోని, కోహ్లి లు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసి కబుర్లు చెప్పుకున్నారు.  పిచ్ అంతా కలియతిరుగుతూ కొద్దిసేపు అక్కడే మాట్లాడుకున్నారు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 

 

🚨 Sandstorm Alert 🚨

Toss delayed in Sharjah by 10 mins! pic.twitter.com/tERTPwrpGx

— IndianPremierLeague (@IPL)

కాగా పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కెప్టెన్లిద్దరూ త్వరలో రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పట్నుంచే చర్చించుకుంటున్నారని నెటిజన్లు  కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉండగా ఐపీఎల్ తర్వాత దాదాపు ఇవే వేదికల్లో (షార్జా, దుబాయ్, అబుదాబి)నే పొట్టి ప్రపంచకప్ కూడా నిర్వహించనున్నారు. భారత జట్టుకు టీ20తో పాటు వన్డే ప్రపంచకప్ కూడా అందించిన ధోని.. భారత జట్టుకు మెంటార్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ జార్ఖండ్ డైనమైట్ అనుభవం భారత్ కు కలిసొస్తుందని బీసీసీఐ భావిస్తున్నది. 

click me!