చెత్తగా ఏమీ ఆడలేదు కానీ....: కివీస్ పై ఓటమిపై విరాట్ కోహ్లీ స్పందన

By telugu teamFirst Published Feb 12, 2020, 8:02 AM IST
Highlights

న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ఓటమిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. తాము విజయానికి అర్హులం కాదని అన్నాడు. తమ బౌలింగ్ చెత్తగా ఉందని, ఫీల్డింగ్ కూడా సరిగా లేదని కోహ్లీ అన్నాడు.

మౌంట్ మాంగనూయి: తాము చెత్తగా ఏమీ ఆడలేదు గానీ విజయానికి అర్హులం కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను కోల్పోవడంపై ఆయన స్పందించాడు. ఏకాగ్రతతో ఆడకపోవడమే తమ ఓటమికి కారణమని ఆయన అన్నాడు. బౌలర్లు చెత్త ప్రదర్శన చేశారని, అది కూడా ఓటమికి కారణమని ఆయన అన్నాడు.

తొలుత స్కోరు చూస్తే ఆట అంత చెత్తగా ఉందని అనిపించలేదని, కానీ అందివచ్చిన అవకాశాలను తాము చేజార్చుకున్నామని ఆయన అన్నాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో గెలువాలంటే ఇలా ఆడితే సరిపోదని ఆయన అన్నాడు. 

Also Read: కివీస్ వన్డే సిరీస్ క్లీన్ స్వీప్: 31 ఏళ్ల తర్వాత ఇండియాకు ఈ గతి

బంతితో తాము గొప్ప ప్రదర్శన చేయలేకపోయామని, ఫీల్డింగ్ లోనూ రాణించలేదని, తాము లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని అన్నాడు. అందుకే తాము విజయానికి అర్హులం కాదని అన్నాడు.

ఒత్తిడిలో బ్యాట్స్ మెన్ పోరాడిని తీరు బాగుందని ఆయన అన్నాడు. బ్యాటింగ్ లో మంచి ప్రదర్శనే చేశామని అంటూ ఫీల్డింగ్, బౌలింగ్ ల్లోనే తమకు ఏకాగ్రత లోపించినట్లు కనిపించింది అన్నాడు. న్యూజిలాండ్ అద్బుతంగా ఆడిందని చెప్పాడు.

Also Read: కివీస్ వర్సెస్ ఇండియా: 21 ఏళ్ల తర్వాత సెంచరీతో కేఎల్ రాహుల్ రికార్డు 

ప్రస్తుతం టెస్టు సిరీస్ జరుగుతుందని, ప్రతీ మ్యాచ్ కూడా కీలకమేనని, తమ జట్టు పటిష్టంగానే ఉందని ఆయన చెప్పాడు. మ్యాచులు, సిరీస్ లు గెలిచే సత్తా తమకు ఉందని, కానీ దాన్ని మనసులో పెట్టుకుని మైదానంలోకి దిగకూడదని ఆయన అన్నాడు.

టీ20లను వైట్ వాష్ చేసిన భారత్ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను 3-0 స్కోరుతో ఓడిపోయింది. న్యూజిలాండ్ పై తొలి టెస్టు మ్యాచ్ ఈ నెల ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

click me!