india pakistan tension: పాక్ దుశ్చ‌ర్య.. జ‌మ్మూపై దాడులు.. పంజాబ్ vs ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ ర‌ద్దు

Published : May 08, 2025, 10:14 PM ISTUpdated : May 08, 2025, 10:21 PM IST
india pakistan tension: పాక్ దుశ్చ‌ర్య.. జ‌మ్మూపై దాడులు.. పంజాబ్ vs ఢిల్లీ ఐపీఎల్ మ్యాచ్ ర‌ద్దు

సారాంశం

india pakistan tension: పాక్ కయ్యానికి కాలు దువ్వింది. జ‌మ్మూపై దాడులు చేసింది. దీనిని భారత్ ధీటుగా ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే పంజాబ్ vs ఢిల్లీ మధ్య ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ర‌ద్దు చేశారు. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకన్నారు. 

IPL 2025 PBKS vs DC: పాకిస్తాన్ అనూహ్యంగా భార‌త్ పై దాడుల‌కు తెగ‌బ‌డింది. ఈ క్ర‌మంలోనే ధర్మశాలలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2025 58వ మ్యాచ్ మధ్యలోనే ర‌ద్దు చేశారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలపై పాకిస్తాన్ దాడుల‌కు పాల్ప‌డ‌నుంద‌నే రిపోర్టుల మ‌ధ్య ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా, భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దీంతో పాకిస్తాన్ నిన్న రాత్రి నుంచి వరుస దాడులు చేసింది. ఈ దాడుల్లో 16 మంది అమాయకులు చనిపోయారు. దీనికి ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేసింది.

రావల్పిండి, లాహోర్ వంటి ప్రాంతాలు దాడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం నుంచి పాకిస్తాన్ సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. భారత్‌పై వరుసగా డ్రోన్‌లను ప్రయోగించింది. వీటిని భారత వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేయబడ్డాయి. ఈలోగా ధర్మశాలాలో ఢిల్లీ - పంజాబ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. 10 ఓవర్లు జరుగుతుండగా కరెంట్ పోవడంతో మ్యాచ్ ఆగిపోయింది.

దీంతో మైదానంలోని ప్రేక్షకులను బయటకు పంపించారు. క్రికెటర్లను కూడా సురక్షితంగా తరలించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేశారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అబ్బ సాయిరామ్.! SRH ప్లేయర్‌పై బీసీసీఐ బ్యాన్.. పండుగ చేసుకుంటున్న ఆరెంజ్ ఆర్మీ
IND vs SA : కోహ్లీ, రోహిత్‌లకు క్రెడిట్ ఇవ్వని గంభీర్‌.. ఇదెక్కడి రచ్చ సామీ !