
గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోవడంపై ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన అతను ఈ ఓటమి తనను తీవ్రంగా నిరాశ పరిచిందని తెలిపాడు.
తాము తమ స్థాయికి తగ్గట్టు ఆడలేదని.. పంజాబ్ ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేశారని అయ్యర్ ప్రశింసించాడు. ఒత్తిడిలో కూడా వారు సహనం కోల్పోలేదని, గెలుపు కోసం పోరాడరన్నాడు. తమ బ్యాట్స్‌మెన్ విజయం కోసం ఏ మాత్రం శ్రమించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. ఢిల్లీ జట్టులోని ప్రధాన ఆటగాళ్లలో ఒకరైన రిషబ్ పంత్‌ను తొందరగా ఔట్ చేయాలనే దానిపై తాము ముందుగానే కసరత్తు చేశామని, అతను తప్పు చేస్తాడని ఊహించి అలాంటి బంతులే వేసి బురిడీ కొట్టించినట్లు అశ్విన్ తెలిపాడు.
ఈ విజయంలో షమీ, కరన్‌లు కీలకపాత్ర పోషించారని తాము మరో 25 పరుగులు చేసి వుంటే బాగుంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మొహాలీలో ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కరన్ హ్యాట్రిక్.. ఢిల్లీపై పంజాబ్ అనూహ్య విజయం