పంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ...

By Arun Kumar PFirst Published Apr 1, 2019, 3:31 PM IST
Highlights

డిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీఫర్, బ్యాట్ మెన్ రిషబ్ పంత్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అతడు కోల్ కతాతో మ్యాచ్ సందర్భంగా కీపింగ్ చేస్తూ తరువాతి బంతి ఫోర్ పొతుందని పంత్ ముందుగానే చెప్పడం స్టంప్స్ మైక్ లో వినబడింది. అతడు అన్నట్లుగానే ఆ తర్వాతి బంతిని బ్యాట్ మెన్ ఫోర్ కొట్టాడు. దీంతో పంత్ మ్యాచ్ పిక్సింగ్ కు పాల్పడటం వల్లే ఇలా ముందు ఏం జరుగుతోందో చెప్పగలిగాడని అభిమానులు, నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదం బిసిసిఐ దృష్టికి వెళ్లడంతో దీనిపై ఓ ఉన్నతాధికారి స్పందించారు. 

రిషబ్‌ అలా ఫోర్ పోతుందని అనడానికి ముందు ఏం మాట్లాడాడో జనాలకు తెలియదని.. ఆ బంతికి ఫోర్‌ వెళ్తుందనే మాటను మాత్రం కట్‌ చేసి అతడిపై దుష్ప్రచారం చేస్తున్నారని బిసిసిఐ అధికారి తెలిపారు. నిజానికి పంత్ ఆఫ్ సైడ్ లో ఫీల్డర్లను పెంచకుంటే ఆ గ్యాప్ లో బ్యాట్ మెన్ ఫోర్ కొడతాడంటూ డిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను హెచ్చరించాడు. అతడలా అన్న తరువాతి బంతికే కెకెఆర్ బ్యాట్ మెన్ ఊతప్ప ఫోర్ కొట్టాడు. దీంతో పంత్ ఫోర్ పోతుందన్న చివరి మాటలను...ఊతప్ప ఫోర్ కొట్టడాన్ని జతచేస్తే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే జరిగిందని ప్రచారం చేస్తున్నారంటూ బిసిసిఐ అధికారి తెలిపారు. 

గతంలోనూ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాలు ఐపిఎల్ లో చోటుచేసుకున్నాయి కాబట్టి పంత్ మాటలపై అనుమానం వ్యక్తమవడంలో తప్పులేదని సదరు అధికారి అన్నారు. కానీ మళ్లీ ఐపిఎల్ ప్రతిష్ట దెబ్బతినకుండా మ్యాచ్ ఫిక్సింగ్ ను నియంత్రించేందుకు బిసిసిఐ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందన్నారు. ఏ ఐపిఎల్ జట్టు, ఆటగాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడే అవకాశాలే లేవని...అలా జరిగినపా ముందుగా తమకు సమాచారం అందుతుందని బిసిసిఐ అధికారి వెల్లడించారు. 
 
click me!