IPL: నేటితో ముగియనున్న గడువు.. ఫ్రాంచైజీలలో రి‘టెన్షన్’

Published : Nov 15, 2022, 02:27 PM IST
IPL: నేటితో ముగియనున్న గడువు.. ఫ్రాంచైజీలలో రి‘టెన్షన్’

సారాంశం

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023   వచ్చే ఏడాది మార్చి చివరివారంలో ప్రారంభంకానుంది.  అంతకంటే ముందే వచ్చే నెల 23న కొచ్చిలో ఐపీఎల్ మినీవేలం జరుగనుంది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ తుది జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. 

టీ20 ప్రపంచకప్ -2022 ముగిసింది.  ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్   మొదలవడానికి ముందు  ఈ ఏడాది డిసెంబర్ 23న కొచ్చి (కేరళ) లో మినీ వేలం జరగాల్సి ఉంది. వేలానికి  సంబంధించి.. అన్ని ఫ్రాంచైజీలు నేడు (నవంబర్ 15) 5 గంటల వరకు తాము రిటెన్షన్  చేసుకునే ఆటగాళ్లు ఎవరు..? వేలంలో వదిలేసేది  ఎవరు..? అనేదానిపై బీసీసీఐకి  నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వేలంలోకి వచ్చేదెవరు..?  ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునేది ఎవరిని..? అనే విషయాలపై  పలు జాతీయ వెబ్‌సైట్లలో వస్తున్న సమాచారం ప్రకారం ఆసక్తికర విషయాలు ఇవిగో.. 

ఐపీఎల్ లో  ఉన్న పది జట్లు  ఈసారి కొంతమంది  ‘బిగ్ ప్లేయర్స్’కు ఊహించని షాక్ ఇవ్వబోతున్నాయి. ఏండ్ల తరబడి అట్టిపెట్టుకున్న  సీనియర్లను కూడా  ‘ఇక మీ సేవలు చాలు మహాప్రభో.. దయచేయండి..’ అని నిర్మొహమాటంగా పంపిస్తున్నాయి. 

వేలం ముచ్చట్లు : 

చెన్నైకి అదే కోర్  టీమ్..

 నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేత  చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)  సాధారణంగా వాళ్ల కోర్ టీమ్ ను మార్చదు.  ఈసారి ఆ జట్టులో రవీంద్ర జడేజా వేలంలోకి వెళ్తాడని భావించినా అలా ఏం జరుగలేదు.  ధోని..జడేజాను ఒప్పించి చెన్నైతోనే ఉండేలా ‘సెట్’ చేశాడని సమాచారం.. (ఇదే తుది జాబితా  కాదు.  పలు జాతీయ వెబ్‌సైట్లలో వస్తున్న సమాచారం ఆధారంగా ఇస్తున్న జాబితా) 

సీఎస్కే రిటెన్షన్ ప్లేయర్లు - ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజ, మోయిన్ అలీ, శివవ్ ధూబే, రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముఖేశ్ చౌదరి, డ్వేన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్ 

వేలంలో వదిలేయనున్నఆటగాళ్లు: క్రిస్  జోర్డాన, ఆడమ్ మిల్నే, నారాయణ్ జగదీశన్, మిచెల్ సాంట్నర్ 

ముంబై ఇండియన్స్ : ముంబై ఈసారి భారీ మార్పులకు సిద్ధమవుతున్నది.  చాలాకాలంగా ఆ జట్టులో భాగమైన స్టార్ ఆల్ రౌండర్ కీరన్  పొలార్డ్ తో బంధాన్ని తెంచుకున్న ముంబై.. గత  సీజన్లో ఆడిన స్పిన్నర్ హృతిక్ షోకీన్, మయాంక్ మార్కండేలను వదులుకుంది. 

ముంబై రిటెన్షన్ : రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా  ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్  స్టబ్స్, తిలక్ వర్మ 

ముంబై వదిలేసుకునేది  :    ఫాబిన్ అలెన్, కీరన్ పొలార్డ్, టైమల్ మిల్స్, మయాంక్ మార్కండే, హృతీక్ షోకీన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఇంతవరకూ ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గని   ఆర్సీబీ స్ట్రాంగ్ బేస్డ్ ప్లేయర్లైన  విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, హర్షల్ పటేల్, వనిందు హసరంగలను   రిటైన్ చేసుకోనుంది. ట్రేడ్ లో భాగంగా ఆర్సీబీ పేసర్ జేసన్ బెహ్రన్డార్ఫ్  (రూ.75 లక్షలు) ను ముంబైకి ట్రాన్స్ఫర్ చేసింది. 

బెంగళూరు రిటెన్షన్ : కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్, వనిందు హసరంగ, దినేశ్ కార్తీక్,మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, రజత్ పాటిదార్ 

వదిలేసేది - సిద్దార్థ్ కౌల్, కర్ణ్ శర్,  డేవిడ్ విల్లీ, ఆకాశ్ దీప్ 

గుజరాత్ టైటాన్స్ : ఆడిన తొలి సీజన్ లోనే ట్రోఫీ కొట్టిన గుజరాత్ టైటాన్స్ తమ జట్టులో కీలక పేసర్ అయిన  లాకీ ఫెర్గూసన్  ను వదిలేసుకోనుంది. 

గుజరాత్ రిటెన్షన్ :  హార్థిక్  పాండ్యా, డేవిడ్  మిల్లర్, శుభమన్ గిల్, అభినవ్ మనోహర్, వృద్ధిమాన్ సాహా, రషీద్ ఖాన్, మహ్మద్  షమీ, రాహుల్ తెవాటియా, రహ్మతుల్లా గుర్బాజ్ 

రిలీజ్ చేసేది వీళ్లనే.. : మాథ్యూ వేడ్, విజయ్ శంకర్, గురుక్రీత్ మన్ సింగ్, జయంత్ యాదవ్, ప్రదీప్ సంగ్వాన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, వరుణ్ ఆరోణ్ 

ఢిల్లీ క్యాపిటల్స్ :  ఈసారివేలానికిముందే ఢిల్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. గతేడాది రూ. 10  కోట్లు పెట్టి కొన్న  శార్దూల్ ఠాకూర్ ను వదులుకున్నది. అతడిని ట్రేడ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు అప్పగించింది. 

ఢిల్లీ రిటైన్డ్ లిస్ట్ : రిషభ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రొవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్ అన్రిచ్  నోర్త్జ్, కుల్దీప్ యాదవ్ 

రిలీజ్ ప్లేయర్లు : శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫర్ట్,కెఎస్  భరత్, మన్దీప్ సింగ్, అశ్విన్ హెబ్బర్ 

కోల్కతా నైట్ రైడర్స్ : ఐపీఎల్  లో రెండుసార్లు ఛాంపియన్ కేకేఆర్ కూడా ఈసారి  జట్టులో భారీ మార్పులతో రానుంది. ఆ జట్టు సీనియర్ఆటగాడు, ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆరోన్ పించ్, సామ్ బిల్లింగ్స్ కూడా ఐపీఎల్  - 16 సీజన్ నుంచి తప్పుకున్నారు. 

 

కేకేఆర్ రిటైన్డ్ ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ రాణా, షెల్డన్ జాక్సన్, రింకూ సింగ్, ఉమేశ్ యాదవ్

వదులుకునేది : శివమ్ మావి, మహ్మద్ నబీ, చమీక కరుణరత్నె , రమేశ్ కుమార్, అజింక్యా రహానే, ఆరోన్ ఫించ్, పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్ 

రాజస్తాన్ రాయల్స్ : గతేడాది ఐపీఎల్ లో ఫైనలిస్టు అయిన రాజస్తాన్ రాయల్స్ ఈసారి అశ్విన్ కు షాకిచ్చేలా ఉంది.  అతడితో పాటు కివీస్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ ను కూడా వదులుకోనుంది. 

రాజస్తాన్ రిటెన్షన్ : సంజూ శాంసన, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్, ప్రసిధ్ కృష్ణ, ఒబెడ్ మెక్ కాయ్ 

రిలీజ్ చేసేది వీళ్లనే : నవదీప్ సైనీ, డారిల్ మిచెల్, రస్సీ వాన్డర్ డసెన్, కొర్బిన్ బోష్ 

- సన్ రైజర్స్ హైదరాబాద్  (ఎస్ఆర్హెచ్)   సారథి కేన్ విలియమ్సన్  ను వదులుకోనుందని తెలుస్తున్నది. అతడితో పాటు  శశాంక్ సింగ్, అబ్దుల్ సమద్, రొమారియా షెపర్డ్, సీన్ అబాట్ లను కూడా ఆ జట్టు వేలానికివదిలేయనుంది. 

 

- పంజాబ్ కింగ్స్ ఎప్పటిలాగే ఈ సీజన్ కు ముందు కూడా  సారథిని మార్చింది. ఈసారి పంజాబ్ కు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు.  మయాంక్ అగర్వాల్ ను వేలానికి వదిలేసిన పంజాబ్.. ఇంగ్లాండ్  ఆటగాడు జానీ బెయిర్ స్టో ను కూడా వదులుకుంది. షారుఖ్ ఖాన్, ఒడియన్ స్మిత్, లను  కూడా అదే జాబితాలోకి పంపనుంది. 

- లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆండ్రూ టై, అంకిత్ రాజ్పుత్ లతో పాటు మనీష్ పాండేలకు మంగళం పాడనున్నారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?