Superstar Krishna: సాహసాల మొనగాడికి హర్షా భోగ్లే నివాళి.. తన చిన్ననాటి హీరోకు సంతాపం

Published : Nov 15, 2022, 11:17 AM IST
Superstar Krishna: సాహసాల మొనగాడికి హర్షా భోగ్లే నివాళి.. తన చిన్ననాటి హీరోకు సంతాపం

సారాంశం

Superstar Krishna Passes Away: తెలుగు సినిమా  దిగ్గజం సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ మరణంపై చిత్ర రంగంతో పాటు క్రీడారంగ ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తున్నారు.  ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ కూడా ట్విటర్లో సంతాపం తెలిపారు.

తెలుగు సినిమాకు సాహసాలను నేర్పించిన  సూపర్ స్టార్, నటశేఖర ఘట్టమనేని కృష్ణ మృతి ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. మంగళవారం   ఉదయం ఆయన మరణించారు.  కృష్ణ మృతికి చిత్రరంగం నుంచే గాక  క్రీడా,  రాజకీయరంగ ప్రముఖులు కూడా తమ అభిమాన హీరోకు నివాళి అర్పిస్తున్నారు. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ ద్వారా  నివాళి ప్రకటించారు. తన చిన్ననాటి అభిమాన హీరో మృతికి హర్షా సంతాపం ప్రకటించారు. 

భోగ్లే స్పందిస్తూ.. ‘నా చిన్ననాటి హీరోలలో మరో దిగ్గజం కన్నుమూసింది. తెలుగు సూపర్  స్టార్ కృష్ణ.  ఎన్టీఆర్, ఎఎన్ఆర్, ఎస్వీఆర్ ల తర్వాత   కృష్ణ గారి సినిమాలు  నాకింకా గుర్తున్నాయి.  అలాగే శోభనబాబు, చంద్రమోహన్, మోహన్ బాబు, జగ్గయ్య, గుమ్మడి, రేలంగిల సినిమాలు  ఎంతో అలరించేవి. ముఖ్యంగా దూరదర్శన్ లో ఆ సినిమాలు చూడటం మాటల్లో చెప్పలేని అనుభూతి..’ అని ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. 

ప్రస్తుతం ముంబైలో ఉంటున్న హర్షాభోగ్లే పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే కావడం విశేషం. హర్షా ఎప్పుడు  హైదరాబాద్ కు వచ్చినా ఇక్కడి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంటారు.  ఆయన తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడగలరు.

 

ఇదిలాఉండగా.. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలో బుర్రిపాలెం అనే కుగ్రామంలో మే 31 1943లో ఘట్టమనేని రాఘవయ్య, నాగరత్నమ్మ లకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. వీరిది వ్యవసాయ కుటుంబం. నటనపై ఆసక్తితో సినిమారంగంలో అడుగు పెట్టారు. ఒడ్డు పొడుగు, ఆకర్షించే అందం , ట్యాలెంట్ పుష్కలంగా ఉండడంతో కృష్ణని అవకాశాలు వరించాయి. 1965లో తేనె మనసులు చిత్రంతో కృష్ణ గారి సినీ ప్రస్థానం మొదలయింది. గూఢచారి 116 అంటూ కౌబాయ్ చిత్రాలతో జైత్ర యాత్ర ప్రారంభించారు. తక్కువ సమయంలోనే స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థాయిలో స్టార్ డం సొంతం చేసుకున్నారు. 

నటనపై ఆసక్తితో సినిమారంగంలో అడుగు పెట్టారు. ఒడ్డు పొడుగు, ఆకర్షించే అందం , ట్యాలెంట్ పుష్కలంగా ఉండడంతో కృష్ణని అవకాశాలు వరించాయి. 1965లో తేనె మనసులు చిత్రంతో కృష్ణ గారి సినీ ప్రస్థానం మొదలయింది. గూఢచారి 116 అంటూ కౌబాయ్ చిత్రాలతో జైత్ర యాత్ర ప్రారంభించారు. తక్కువ సమయంలోనే స్వర్గీయ ఎన్టీఆర్, ఏఎన్నార్ స్థాయిలో స్టార్ డం సొంతం చేసుకున్నారు. అలాగే కృష్ణ కురుక్షేత్రం లాంటి పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు.చిత్ర పరిశ్రమ బాగు కోసం కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. భారత ప్రభుత్వం ఆయన్ని 2009లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. కృష్ణ మరణ వార్త తెలియగానే ఇండస్ట్రీ ప్రముఖులంతా టాలీవుడ్ పెద్ద దిక్కుని కోల్పోయింది అంటూ విషాదంలో మునిగిపోయారు. 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో టాప్ 6 కాస్ట్లీ ప్లేయర్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?