SRHvsRR: మనీశ్ పాండే హాఫ్ సెంచరీ... రాజస్థాన్‌ ముందు ఊరించే టార్గెట్...

Published : Oct 11, 2020, 05:12 PM ISTUpdated : Oct 11, 2020, 05:21 PM IST
SRHvsRR: మనీశ్ పాండే హాఫ్ సెంచరీ... రాజస్థాన్‌ ముందు ఊరించే టార్గెట్...

సారాంశం

48 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్... హాఫ్ సెంచరీ చేసిన మనీశ్ పాండే... ఆఖర్లో కేన్ విలియంసన్ మెరుపు...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. స్లో వికెట్ కారణంగా పిచ్ బ్యాటింగ్‌కి సహకరించకపోవడంతో పరుగులు రాబట్టేందుకు చాలా కష్టపడ్డారు సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్. బెయిర్ స్టో 19 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ కాగా... డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

మనీశ్ పాండే 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆఖర్లో కేన్ విలియంసన్ 12 బంతుల్లో 22, ప్రియమ్ గార్గ్ 8 బంతుల్లో 15 పరుగులు చేయడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, జయదేవ్ ఉనద్కడ్ తలా వికెట్ తీశారు. 

PREV
click me!

Recommended Stories

T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !
T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?