David Warner: మూడు ఫార్మాట్ల‌లో సెంచరీ .. 3వ క్రికెట‌ర్‌గా వార్న‌ర్ భాయ్ స‌రికొత్త‌ రికార్డు !

By Mahesh Rajamoni  |  First Published Feb 9, 2024, 4:32 PM IST

David Warner: డేవిడ్ వార్న‌ర్ మూడు ఫార్మాట్ ల‌లో క‌లిపి 100 మ్యాచ్ ల‌ను ఆడిన తొలి ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ గా స‌రికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఫీట్ సాధించిన ముగ్గురు ప్లేయ‌ర్ల‌లో ఒకడిగా నిలిచాడు. 
 


David Warner: వార్న‌ర్ భాయ్ క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. త‌న ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డే ఆస్ట్రేలియాస్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్ మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్ గా నిలిచాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఈ ఫీట్ సాధించిన మూడో క్రికెట‌ర్ గా వార్న‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. హోబర్ట్ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టీ20కి ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకోవ‌డంతో డేవిడ్ వార్నర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. గత నెలలో టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు తరఫున 112 టెస్టులు, 161 వన్డేలు ఆడాడు.

వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య జ‌రిగే ఈ టీ20 సిరీస్ లోని తొలి మ్యాచ్ హోబర్ట్ వేదిగా జ‌ర‌గ‌నుంది. ఇది డేవిడ్ వార్న‌ర్ కు 100వ టీ20 మ్యాచ్. అంత‌కుముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్, భారత స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీలు మూడు ఫార్మాట్ ల‌లో 100 మ్యాచ్ ల‌ను ఆడిన ప్లేయ‌ర్లుగా రికార్డుల‌కు ఎక్కారు. వారి త‌ర్వాత మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్ లు ఆడిన మూడో క్రికెటర్ గా డేవిడ్ వార్న‌ర్ నిలిచాడు. మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్ కీవీస్ ప్లేయ‌ర్ రాస్ టేలర్. బ్లాక్ క్యాప్స్ తరఫున తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో రాస్ టేలర్ 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు.

Latest Videos

undefined

అందులో నిజం లేదు.. విరాట్ కోహ్లీకి క్షమాప‌ణ‌లు చెప్పిన ఏబీ డివిలియర్స్.. ! 

2022లో టేలర్ సరసన టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ చేరాడు.  విరాట్ కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు 113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్ మన్ గా, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ నిలిచాడు. అలాగే, అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్లో 4 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మ‌న్ విరాట్ కోహ్లీనే. ఇదిలావుండ‌గా, ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ త‌ర్వాత 2021 టీ20 వరల్డ్ క‌ప్ విజేతల తరఫున 100+ టీ20లు ఆడిన మూడో ఆస్ట్రేలియా క్రికెటర్ గా వార్నర్ నిలిచాడు. ఆసీస్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ నిలిచాడు. 103 టీ20లు ఆడాడు. కంగారుల జట్టు తరుపున 101 టీ20 మ్యాచ్ ల‌ను ఆడిన మ్యాక్స్ వెల్ రెండో స్థానంలో ఉన్నాడు.

భారత్ కు మరో బిగ్ షాక్.. మరో స్టార్ ప్లేయర్ IND VS ENG సిరీస్ నుంచి ఔట్.. !

click me!