AB de Villiers-Virat Kohli: ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లో విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడనీ, అతని కుటుంబంతో ఉండటంతోనే ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్‌కి విరామం తీసుకున్నాడని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఏబీ డివిలియర్స్ క్షమాపణలు చెప్పాడు.
Virat Kohli - AB de Villiers:భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. మిగిలిన మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనే సందేహాల మధ్య దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్, కోహ్లీ సన్నిహితుడు ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు తమ రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు. నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దీనిపై విరాట్ కుటుంబం గానీ, బీసీసీఐ గానీ స్పందించలేదు.
అయితే, తాజాగా విరాట్ కోహ్లీకి ఎబీ డివిలియర్స్ క్షమాపణలు చెప్పాడు. కోహ్లీ విషయంలో తాను ఇదివరకు చెప్పిన విషయంలో నిజం లేదని పేర్కొన్నాడు. తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. ఈ క్రమంలోనే తాను ఘోరమైన తప్పును చేసినట్టు కూడా తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. 'నేను నా యూట్యూబ్ షోలో చెప్పినట్లు కచ్చితంగా కుటుంబమే మొదటి ప్రాధాన్యత. అలాగే, నేను అదే సమయంలో ఘోరమైన తప్పు చేశాను.. అవును, తప్పుడు సమాచారాన్ని పంచుకున్నాను.. ఇది ఎంతమాత్రం నిజం కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను చేయగలిగిందల్లా అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. విరాట్ ను అనుసరించే.. అతని క్రికెట్ ను ఆస్వాదించే ప్రపంచం మొత్తం అతనికి శుభాకాంక్షలు తెలపాలని నేను అనుకుంటున్నాను.. ఈ విరామానికి కారణం ఏదైనా సరే. అతను మరింత బలంగా, మెరుగ్గా, ఆరోగ్యంగా, తాజాగా తిరిగి వస్తాడని ఆశిస్తున్నా' అని దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ తెలిపాడు.
undefined
Family comes first and then Cricket. I made a terrible mistake, sharing false information which was not true at all, no one knows what's happening with Virat Kohli : AB De Villiers pic.twitter.com/FP6gsm0kwm
— mahe (@mahe950)హెలికాప్టర్ షాట్స్ మోత.. ! ఐపీఎల్ కోసం ధోని మొదలు పెట్టాడు.. !
తప్పుడు సమాచారం.. !
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని మొదట్లో డివిలియర్స్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభ మ్యాచ్ లకు కోహ్లీ దూరంగా ఉండటానికి కుటుంబ కట్టుబాట్లే కారణమని డివిలియర్స్ చెప్పాడు. అయితే, ఏబీ తప్పుడు సమాచారం పంచుకున్నారని తెలియడంతో అతని పై విమర్శలు వస్తుస్తున్నాయి. తన తప్పు తీవ్రతను గ్రహించిన డివిలియర్స్ వెంటనే తన తప్పును అంగీకరించి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు క్షమాపణలు చెబుతూ తన మునుపటి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. తప్పును అంగీకరించి మంచి పనిచేశాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.
INDIA VS ENGLAND: సిరీస్ మొత్తానికి విరాట్ కోహ్లీ దూరం.. 3వ టెస్టులో కేఎల్ రాహుల్-రవీంద్ర జడేజా !