CSK vs RCB: చెన్నైలో దుమ్మురేప‌డానికి సిద్ధ‌మైన విరాట్ కోహ్లీ.. !

By Mahesh Rajamoni  |  First Published Mar 22, 2024, 4:47 PM IST

Virat Kohli IPL Records : ఐపీఎల్ 2024 కు స‌ర్వం సిద్ద‌మైంది. చెన్నై వేదిక‌గా ఘ‌నంగా ప్రారంభ వేడుక‌లు పూర్తయిన త‌ర్వాత ఆర్సీబీ-సీఎస్కే జ‌ట్లు తొలి మ్యాచ్ లో భాగంగా త‌ల‌ప‌డ‌నున్నాయి. బెంగ‌ళూరు స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ చెన్నై లో దుమ్మురేప‌డానికి సిద్ధంగా ఉన్నాడు. 
 


RCB - Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 17వ సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ షురూ అయింది.  చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ కు స‌ర్వం సిద్ద‌మైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ల‌వ‌ర్స్ ఆస‌క్తి ఎదురుచూస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఎంఎస్ ధోని, కింగ్ విరాట్ కోహ్లీ ఆట‌ను చూడ్డానికి స్టేడియం వ‌ద్ద కోలాహ‌లం మొద‌లైంది.

ఈ సారి ఎలాగైనా టైటిల్ గెల‌వాల‌ని చూస్తున్న బెంగ‌ళూరు టీమ్ కోసం త‌న సంపూర్ణ ప్ర‌య‌త్నాలు ఉంటాయ‌ని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ రెండో బిడ్డకు జన్మనిచ్చిన కారణంగా క్రికెట్ దాదాపు రెండు నెల‌లు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా జనవరిలో ఆడిన అతను రెండు నెలల తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. అయితే, విరాట్ కోహ్లి పునరాగమనం చేయబోతున్న మైదానంలో కింగ్ కోహ్లీ గ‌త ప్ర‌ద‌ర్శ‌న త‌ప్పిదాల‌ను క‌నిపించ‌కుండా బ్యాట్ తో దుమ్మురేపాల‌నుకుంటున్నాడు.

Latest Videos

CSK VS RCB: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని ధోని ఎందుకు వదులుకున్నాడు?

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విరాట్ కోహ్లీ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 363 పరుగులు మాత్రమే చేయగా, ఇక్కడ అతని సగటు 30.17గా ఉంది. అదే సమయంలో స్ట్రైక్ రేట్ 11.38గా ఉంది. చెన్నై పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. చెన్నైలో జరిగిన ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే సాధించాడు. ఇవి దశాబ్దం క్రితం వచ్చాయి. ఈ మైదానంలో ఆర్సీబీకి పెద్ద రికార్డులు కూడా లేవు. 2011లో చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ఓడిపోయింది. దీంతో ప్రారంభ మ్యాచ్ లో కింగ్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ప్లేయ‌ర్లు చెన్నై స్పిన్న‌ర్లను ఎలా ఎదుర్కుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే చెన్నై గడ్డపై విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా పరుగులు చేశాడు. ప్రపంచకప్2023 లీగ్ దశ మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ సాధించాడు. విరాట్ చెన్నైపై 30 ఇన్నింగ్స్‌లలో 9 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ జట్టుపై 1000 పరుగులకు చేరువలో ఉన్నాడు. చెన్నైపై విరాట్ కోహ్లీ 15 పరుగులు చేసిన వెంటనే, ఈ లీగ్ చరిత్రలో ఈ ఫ్రాంచైజీపై 1000 పరుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్ గా నిలుస్తాడు. చెన్నైతో ఆడటం ఓ ప్రత్యేక పండుగ లాంటిదని.. అదో పెద్ద గేమ్ అని విరాట్ అన్నాడు. ఈ సారి త‌ప్ప‌కుండా క‌ప్ గెలుస్తామ‌నే ధీమాను వ్య‌క్తం చేశాడు.

ఐపీఎల్ 2024: ఆరు జ‌ట్ల‌కు కొత్త సార‌థులు.. 10 జ‌ట్ల కెప్టెన్లు వీరే.. !

click me!