CSKvsMI: ముంబై ఇండియన్స్ ‘టాప్ క్లాస్’ పర్ఫామెన్స్... సీఎస్‌కే ఘోర పరాజయం...

Published : Oct 23, 2020, 10:25 PM IST
CSKvsMI: ముంబై ఇండియన్స్  ‘టాప్ క్లాస్’  పర్ఫామెన్స్... సీఎస్‌కే ఘోర పరాజయం...

సారాంశం

ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ... డి కాక్ క్లాస్ పర్ఫామెన్స్... 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్...

IPL 2020 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ బరిలో దిగకపోయినా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించి అదరగొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్. 115 పరుగుల స్వల్ప లక్ష్యచేధనను 12.2  ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా చేధించింది ముంబై ఇండియన్స్...

రోహిత్ శర్మ స్థానంలో ఓపెనింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేయగా... డి కాక్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్‌ మంచి రన్‌రేటుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడమే కాకుండా ప్లేఆఫ్‌కి దాదాపు అర్హత సాధించింది.

11 మ్యాచుల్లో ఎనిమిది మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ సీజన్‌లో ప్లేఆఫ్ నుంచి పూర్తిగా నిష్కమించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే