CSKvsMI: ధోనీ సేన మరింత దారుణంగా... సూపర్ కింగ్స్‌ని వణికించిన ముంబై బౌలర్లు...

By team teluguFirst Published Oct 23, 2020, 9:17 PM IST
Highlights

ట్రెంట్ బౌల్ట్‌కి 3 వికెట్లు, బుమ్రాకి రెండు వికెట్లు, రెండు వికెట్లు తీసిన రాహుల్ చాహార్...

పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన సామ్ కుర్రాన్...

16 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ...

IPL 2020 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్‌కి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు మరింత ఘోరంగా తయారైంది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు, పరమ చెత్త బ్యాటింగ్ ప్రదర్శనతో ధోనీ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. టాస్ ఓడి  బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.... 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులకి పరిమితమైంది. రెండో ఓవర్‌లో 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్‌‌ మొదటి ఓవర్‌లోనే అవుట్ కాగా... రెండో ఓవర్‌లో అంబటి రాయుడు, జగదీశన్‌లను వెంటవెంటనే అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు బుమ్రా. ఆ తర్వాతి ఓవర్‌లో డుప్లిసిస్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ధోనీ, జడేజా ఆదుకుంటారని భావించారంతా.

అయితే 7 పరుగులు చేసిన జడేజాను బౌల్ట్, 16 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీని రాహుల్ చాహార్ అవుట్ చేశారు. దీంతో 43 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయింది సీఎస్‌కే. రాయల్ ఛాలెంజర్స్ పేరిట ఉన్న 49 పరుగుల చెత్త రికార్డును సీఎస్‌కే అందుకునేలా కనిపించింది. అయితే శార్దూల్ ఠాకూర్ 11, ఇమ్రాన్ తాహీర్ ‌లతో కలిసి సామ్ కుర్రాన్ ఇన్నింగ్స్ కారణంగా సీఎస్‌కే ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న శామ్ కర్రాన్, ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో మూడు డకౌట్లు ఉండగా ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌కి నాలుగు వికెట్లు దక్కగా, బుమ్రాకి రెండు వికెట్లు, రాహుల్ చాహాల్ 2, కౌల్టర్ నైల్ ఓ వికెట్ తీశాడు.

click me!