బాగానే ఉన్నా... రికవరీ అయి వస్తున్నా... కపిల్ దేవ్ ట్వీట్...

Published : Oct 23, 2020, 09:22 PM IST
బాగానే ఉన్నా... రికవరీ అయి వస్తున్నా... కపిల్ దేవ్ ట్వీట్...

సారాంశం

ప్రేమ, ఆదరణ చూపించిన మీ అందరికీ నా ధన్యవాదాలు... బాగానే ఉన్నా, రికవరీ అవుతున్నానంటూ ట్వీట్ చేసిన కపిల్ దేవ్...

క్రికెటర్ కపిల్ దేవ్ గుండెపోటుకి గురి అయ్యేరనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని ఆందోళనకి గురి చేసింది. భారత జట్టుకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన క్రికెట్ సారథి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ లక్షలాది క్రికెట్ అభిమానులు ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనల కారణంగా తాను క్షేమంగా ఉన్నానని తెలుపుతూ, ట్వీట్ చేశాడు కపిల్ దేవ్. 

 

 

‘నాపైన ప్రేమ, ఆదరణ చూపించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. మీ అమితమైన మంచి విషెస్‌‌తో నేను ఉప్పొంగిపోయాను. ఇప్పుడు బాగానే ఉన్నా, రికవరీ అవుతున్నా’ అంటూ ట్వీట్ చేశాడు కపిల్ దేవ్. భారత క్రికెట్ జట్టులో లెజెండరీ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన కపిల్ దేవ్, టెస్టుల్లో 5 వేలకి పైగా పరుగులు, 400లకి పైగా వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా ఉన్నాడు. కపిల్ దేవ్ ట్వీట్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. కపిల్ దేవ్ త్వరగా డిశార్జ్ అయ్యి, క్రికెట్ క్రీజులోకి రావాలని కోరుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు