
CSK vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోరులో చెన్నై టీమ్ ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2024లో జరుగుతున్న 7వ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బ్యాటింగ్ కు దిగింది. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేలు ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
అనంతరం 207 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచి గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయి చెన్నై చేతిలో చిత్తుగా ఓడింది. శుబ్ మన్ గిల్ కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత దీపక్ సాగర్ వేసిన బంతి వృద్ధిమాన్ సాహా హెల్మెట్‌ను తాకింది. ఆ తర్వాతి బంతికే 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ 12 బంతుల్లో ఒక సిక్సర్ సహా 12 పరుగులు మాత్రమే చేసి, వికెట్ కీపర్ ధోనీకి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.
అయితే, విజయ్ శంకర్ ఇచ్చిన క్యాచ్ ను పట్టుకోవడానికి ఎంఎస్ ధోని సింహంలా దూకాడు. తన వయస్సు 42 అయినప్పటికీ... అది సంఖ్య మాత్రమేనని ఈ సూపర్ డైవింగ్ క్యాచ్ తో మరోసారి నిరూపించాడు. కళ్లుచెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఇలాంటి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అభిమానులంతా ధోని.. ధోని అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఇక సోషల్ మీడియాలో రచ్చ మాములుగా లేదు. ధోనీని సింహం, పులితో పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ పోస్ట్ లు వెళ్లువెత్తుతున్నాయి.
CSK VS GT : బౌండరీల వర్షం.. గుజరాత్ బౌలింగ్ ను రఫ్ఫాడించిన రచిన్ రవీంద్ర, శివం దూబే !