BMW కారు కొనుగోలు చేసిన మహ్మద్ సిరాజ్... ఆటో డ్రైవర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి...

By team teluguFirst Published Jan 22, 2021, 4:11 PM IST
Highlights

మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్... 

నాలుగో టెస్టుకి బౌలింగ్ విభాగానికి నాయకత్వం... రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిసిన సిరాజ్...

టెస్టు సిరీస్‌కి ముందు తండ్రిని కోల్పోయినా క్రికెట్ ఆడేందుకే నిర్ణయం...

స్వదేశం చేరిన తర్వాత నేరుగా తండ్రి సమాధిని దర్శించుకుని, నివాళి ఘటించిన మహ్మద్ సిరాజ్...

ఆస్ట్రేలియా టూర్ తర్వాత భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ జీవితం  పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు ఐపీఎల్‌లో రాణించినా, టీమిండియా తరుపున ఆడినా పెద్దగా పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు సిరాజ్ మంత్రం జపిస్తున్నారు. దీనికి కారణం అనేక అవరోధాలను అధిగమించి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ చూపించిన అద్భుత ప్రదర్శనే.

మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చిన సిరాజ్... నాలుగో టెస్టులో బౌలింగ్ విభాగానికి నాయకుడిగా వ్యవహారించి ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు.ఆసీస్ టూర్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్... టెస్టు సిరాజ్ ఆరంభానికి ముందే తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే.

తండ్రి అంతిమ యాత్రలకు కూడా రాకుండా జట్టుతోనే ఉండి, అద్భుత ప్రదర్శనతో ఆయనకు ఘనమైన నివాళి అర్పించాడు. ‘ఈ సిరీస్‌లో భారత జట్టుకి దొరికిన ఆణిముత్యం సిరాజ్.. తండ్రిని కోల్పోయినా, రేసిజం వ్యాఖ్యలకు గురైనా అతను ముత్యంలా మెరిసాడు’ అంటూ భారత కోచ్ రవిశాస్త్రి మెచ్చుకున్నాడు.

తాజాగా సిరాజ్, తన సంపాదనతో అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశాడు. సిరాజ్ తండ్రి ఓ ఆటో డ్రైవర్ అయిన సంగతి తెలిసిందే.  తాను ఇప్పుడు సెలబ్రిటీ కావడం సంతోషంగా ఉందని చెప్పిన సిరాజ్... ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. నిరుపేద కుటుంబం నుంచి క్రికెట్ స్టార్‌గా ఎదిగిన సిరాజ్, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.

click me!