అందుకు మేం సిద్ధమే.. కానీ! బీసీసీఐ అంతగా పట్టించుకోని రమీజ్ రాజా కీలక ప్రతిపాదనకు క్రికెట్ ఆస్ట్రేలియా సై..

Published : Mar 11, 2022, 05:01 PM IST
అందుకు మేం సిద్ధమే.. కానీ! బీసీసీఐ అంతగా పట్టించుకోని రమీజ్ రాజా కీలక ప్రతిపాదనకు క్రికెట్ ఆస్ట్రేలియా సై..

సారాంశం

Australia Open For Ind-Pak-Aus Tri series: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు  అధ్యక్షుడు రమీజ్ రాజా ప్రతిపాదించిన నాలుగు దేశాల టీ20 ట్రోఫీ ప్రతిపాదనపై ఆస్ట్రేలియా సానుకూలంగా స్పందించింది. కానీ ఇందులో చిన్న మార్పు చేసింది. 

టీమిండియా.. ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్.. పాకిస్థాన్.. ఏ ఫార్మాట్ లో చూసుకున్నా ఈ నాలుగు జట్లు నిస్సందేహంగా అగ్రశ్రేణి జట్లే. ర్యాంకులు, రికార్డులు ఇతరత్రా విషయాలు కాసేపు పక్కనెడితే  ఈ నాలుగు జట్లలో ఏ రెండు జట్ల మధ్య  మ్యాచ్ జరిగినా అది ఆసక్తికరమే. ఇక ఇండియా తో అయితే  పైన పేర్కొన్న అన్ని దేశాలతో మ్యాచులు జరిగితే అది టగ్ ఆఫ్ వారే.. ఇంగ్లాండ్,  ఆసీస్ ను కాసేపు మినహాయిస్తే పాకిస్థాన్ తో అయితే అది ఓ మినీ యుద్ధమే. ఈ నాలుగు దేశాలు కలిసి ఓ టోర్నీ ఆడితే.. ఆ మజానే వేరు కదా.. ఆ ప్రతిపాదనే వచ్చింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ రమీజ్ రాజాకు. 

ఈ ఏడాది జనవరిలో అతడు ఐసీసీ ముందు ఈ ప్రతిపాదనను ఉంచాడు. నాలుగు దేశాలతో కలిసి తటస్థ వేదికలలో టీ20 సిరీస్ ను నిర్వహించుదామని,  టోర్నీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని నాలుగు దేశాలు సమానంగా పంచుకోవాలని ప్రతిపాదించాడు. 

అయితే ఈ ప్రతిపాదనకు బీసీసీఐ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఆస్ట్రేలియా మాత్రం  ఇందుకు కాస్త సానుకూలంగానే ఉంది. అయితే రమీజ్ రాజా ప్రతిపాదిస్తున్నట్టుగా నాలుగు దేశాలతో కాకుండా.. ఆ జాబితాలోంచి ఇంగ్లాండ్ ను మినహాయించింది. భారత్-పాకిస్థాన్-ఆస్ట్రేలియాతో కలిసి ముక్కోణపు టీ20 టోర్నీ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ కు వచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్.. నిక్ హాక్లీ ఇందుకు సానుకూలంగా స్పందించాడు. 

 

ఇండియా, పాకిస్థాన్ నుంచి చాలా మంది ప్రజలు ఆస్ట్రేలియా లో నివసిస్తున్నారని, ఒకవేళ ఈ రెండు దేశాలతో కలిసి  ముక్కోణపు సిరీస్ నిర్వహిస్తే స్టేడియాలకు హౌజ్ ఫుల్ బోర్డు పెట్టుకోవాల్సిందేనని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.  ఇదే విషయమై హాక్లీ మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా నాకు ముక్కోణపు సిరీస్ లు అంటే చాలా ఇష్టం. మేము కూడా గతంలో వీటిని విరివిగా నిర్వహించేవాళ్లం. ఇండియా, పాకిస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఈ మూడు దేశాలు కలిసి టీ20 నిర్వహిస్తే   అది భారీ విజయవంతం అవుతుంది...’అని  అన్నారు. 

ఇదిలాఉండగా గతనెలలో ఇదే విషయమై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బీసీసీఐ కార్యదర్శి  జై షా మాట్లాడుతూ..  తాము తాత్కాలిక ఆదాయాల కోసం వెంపర్లాడటం లేదని,  తమ లక్ష్యం ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడమని అన్నారు.  పాకిస్థాన్ పేరెత్తకుండానే ఈ ప్రతిపాదనపై తమకు అంత ఆసక్తి లేదని  చెప్పకనే చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?