Pak vs Aus: ఇదేం పిచ్.. కనీసం యావరేజి రేటింగ్ కూడా ఇవ్వం.. పాకిస్థాన్ కు ఊహించని షాక్ ఇచ్చిన ఐసీసీ

Published : Mar 11, 2022, 02:30 PM ISTUpdated : Mar 11, 2022, 02:32 PM IST
Pak vs Aus: ఇదేం పిచ్..  కనీసం యావరేజి రేటింగ్ కూడా ఇవ్వం.. పాకిస్థాన్ కు  ఊహించని షాక్ ఇచ్చిన ఐసీసీ

సారాంశం

Rawalpindi Pitch Row: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది.  జీవం లేని పిచ్ తయారుచేసి విమర్శలు ఎదుర్కుంటున్న పాక్.. తీవ్ర విమర్శల పాలవుతున్న నేపథ్యంలో తాజాగా.. 

రావల్పిండి వేదికగా  ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టెస్టు పేలవమైన డ్రా గా ముగిసిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు  ఊహించని షాకిచ్చింది. అసలు  ఆ  (రావల్పిండి) పిచ్ తయారీలో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించారా..?  అని  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు రోజుల పాటు నిర్జీవంగా ఉండే పిచ్ ను తయారుచేయడమేంటని ఆక్షేపించింది.  రెండ్రోజులు పిచ్ లో మార్పులేమీ లేకుంటే ఏమీ లేదు గానీ ఏకంగా ఐదు రోజుల పాటు  జీవం లేకుండా ఉండటమేంటని.. అసలేం జరుగుతుందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

పాకిస్థాన్-ఆస్ట్రేలియా ల మధ్య మార్చి 12 నుంచి 16 మధ్య జరిగిన తొలి టెస్టు బ్యాటర్లకు స్వర్గధామమైంది. ఇరు జట్ల ఆటగాళ్ల పరుగుల పండుగ చేసుకున్నారు. పాకిస్థాన్ నుంచి  రెండు ఇన్నింగ్స్ లలో కలిపి  నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బౌలర్లకు ఇసుమంతైనా సహకరించని ఈ పిచ్ పై స్వయంగా  ఆటగాళ్లతో పాటు పాక్ మాజీలు, సీనియర్ ప్లేయర్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బిలో యావరేజీ కూడా కష్టమే.. 

ఈ నేపథ్యంలో ఐసీసీ కూడా తాజాగా స్పందించింది.  ఇదే విషయమై ఈ మ్యాచుకు రిఫరీగా వ్యవహరించిన రంజన్ మధుగులే మాట్లాడుతూ.. ‘ఆసీస్-పాక్ కు మధ్య జరిగిన తొలి మ్యాచుకు ఉపయోగించిన పిచ్  లో తొలి రోజు నుంచి చివరిదాకా ఎటువంటి మార్పుూ కనిపించలేదు.   సాధారణంగా రెండు రోజులు పిచ్ స్పందించకుండా ఉండటం చూస్తాం. కానీ ఈ పిచ్ మాత్రం ఏకంగా ఐదు రోజుల పాటు నిర్జీవంగా ఉంది.  బౌలర్లకు ఏమాత్రం స్పందించని ఈ పిచ్ మీద  బ్యాటర్లు పండుగ చేసుకున్నారు.  ఈ పిచ్ కనీస ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో ఉంది.  నా దృష్టిలో ఇటువంటి పిచ్ లలో బంతికి బ్యాట్ కు సమరం సరిగా ఉండదు.  అటు  పేసర్లకు, ఇటు స్పిన్నర్లకు.. ఎవరికీ పిచ్ నుంచి సహకారం అందలేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం..   ఈ పిచ్ కు బిలో యావరేజీ (సాధారణ పిచ్) రేటింగ్ ఇస్తాం..’ అని అన్నాడు. 

ఇదే పిచ్ పై  ఆసీస్ సారథి పాట్ కమిన్స్ స్పందిస్తూ.. ‘రావల్పిండిలో సాంప్రదాయకంగా ఉన్న పిచ్ ను మార్చి తయారుచేసిన కొత్త పిచ్ లో పేసర్లకు ఎటువంటి సహకారం లభించలేదు. బౌలర్లకు సహకారం అందకూడదనే ఇటువంటి పిచ్ ను తయారుచేసినట్టు ఉన్నారు..’ అని అన్నాడు. 

పనికిమాలిన పిచ్ లను తయారు చేయకండి ప్లీజ్..

ఇక ఇదే విషయమై పాక్ మాజీ ఆటగాళ్లు ఇంజమామ్ ఉల్ హక్, సల్మాన్ భట్ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇంజమామ్ మాట్లాడుతూ... ‘‘ఈ టెస్టులో పిచ్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ పిచ్ ఏంటి ఇలా ఉంది..? అని చాలా మంది అడుగుతున్నారు.. వాళ్ల ప్రశ్నలో న్యాయముంది. ఈ రోజుల్లో టెస్టు మ్యాచ్ డ్రా అయితే  అది నిజంగా వింతే అనిపిస్తుంది. చివరిసారిగా మనం ఇలాంటి టెస్టును ఎప్పుడు చూశామో కూడా నాకు  సరిగా గుర్తు లేదు.  రావల్పిండి టెస్టు తొలి రోజే పిచ్ ఎలా ఉంటుందో నాకు అర్థమైంది.. ఇదో జీవం లేని పిచ్.. వచ్చే టెస్టులో అయినా ఇలాంటి పనికిమాలిన పిచ్ ను తయారు చేయరని ఆశిస్తున్నా..’ అని తెలిపాడు. 

ఇక భట్ మాట్లాడుతూ.. ‘పాక్ పిచ్ లలో తప్పేంఉందో నాకు చెప్పండి.  సాధారణంగా రావల్పిండి అనేది ఫలితం  తేలే పిచ్.  ఫస్ట్ క్లాస్ మ్యాచులలో అయితే ఈ పిచ్  లో 2.5 రోజుల్లోనే ఫలితం వస్తున్నది. కానీ  ఆసీస్ తో తొలి టెస్టులో మాత్రం ఐదు రోజులైనా ఫలితం రాలేదంటే నిందించాల్సింది పిచ్ ను కాదు.. పిచ్ లను తయారుచేయిస్తున్న వారిది. ఉన్నత స్థానాల్లో (పీసీబీ లోని వ్యక్తులను ఉద్దేశిస్తూ) ఉన్న వ్యక్తుల ఆలోచన విధానం అలా దిగజారింది. మన బ్యాటర్ల మీద నమ్మకం లేనప్పుడే వాళ్లకు ఇలాంటి పిచ్ లు తయారుచేయాలనే ఆలోచనలు వస్తాయి..’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

తొలి టెస్టులో స్కోర్ల వివరాలు : పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 476-4 (డిక్లేర్డ్), రెండో ఇన్నింగ్స్ : 252-0, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 459 ఆలౌట్ 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?