మీ క్రికెట్ పరిజ్ఞానానికి పరీక్ష: ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టగలరా..?

Siva Kodati |  
Published : May 19, 2020, 08:54 PM ISTUpdated : May 19, 2020, 08:57 PM IST
మీ క్రికెట్ పరిజ్ఞానానికి పరీక్ష: ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టగలరా..?

సారాంశం

లాక్‌డౌన్ వేళ కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక పరీక్ష పెట్టింది. అండర్‌వేర్‌‌లా కనిపిస్తున్న దానిని మొహంపై ధరించిన ఓ ప్రముఖ క్రికెటర్ ఫోటోను, ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది

లాక్‌డౌన్ వేళ కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక పరీక్ష పెట్టింది. అండర్‌వేర్‌‌లా కనిపిస్తున్న దానిని మొహంపై ధరించిన ఓ ప్రముఖ క్రికెటర్ ఫోటోను, ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇతనెవరో గుర్తుపెట్టారా అంటూ సరదాగా  పోస్ట్ చేసింది.

Also Read:లాక్ డౌన్ సడలింపులు.. క్రికెట్ కి గ్రీన్ సిగ్నల్ పై ద్రవిడ్ స్పందన

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అతను తన దేశం తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ అని వన్డే మ్యాచ్‌లలో 50 వికెట్లు కూడా పడగొట్టాడు అంటూ కొన్ని క్లూలు ఇచ్చింది. అప్పటికీ ఈ క్రికెటర్ ఎవరో గుర్తు పట్టలేదా.. అంటూ మరిన్ని హింట్లను ఇచ్చింది.

అతను 2011లో ఇంగ్లాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేశాడని... అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో అత్యధిక సగటు (వేయి పరుగుల వరకు మాత్రమే) అంటూ చెప్పింది. అతనెవరో కాదు ర్యాన్ టెన్ డోస్పేట్.. నెదర్లాండ్ తరపున అత్యధిక పరుగులు (2,704) సాధించిన క్రికెటర్.

Also Read:నా సెలక్షన్ కి మా నాన్నని లంచం అడిగారు.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్

ఇక బౌలింగ్‌లోనూ సత్తా చాటి 55 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో కేవలం 32 మ్యాచ్‌లు ఆడి, 67 సగటుతో 1,541 పరుగులు చేశాడు. వీటిలో 5 సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు (119) ఇంగ్లాండ్‌తో 2011 జరిగిన మ్యాచ్‌లో సాధించాడు.

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !