Prakhar Chaturvedi: దేశవాళీ క్రికెట్‌లో భాగంగా అండర్ – 19 స్థాయిలో బీసీసీఐ నిర్వహించే కూచ్‌బెహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో సంచలనం నమోదైంది. కర్ణాటక బ్యాటర్.. ప్రకర్ చతుర్వేది అరుదైన రికార్డు సాధించాడు. కర్నాటక – ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచులో 404 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచిన ప్రకర్.. కూచ్‌బెహర్ ట్రోఫీ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
Prakhar Chaturvedi: బీసీసీఐ దేశవాళీ టోర్నీ కూచ్ బెహర్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. ఈ ట్రోఫీ ఫైనల్ లో కర్ణాటక బ్యాట్స్‌మెన్ ప్రఖర్ చతుర్వేది చరిత్ర సృష్టించాడు. ఈ అండర్-19 పోటీలో భాగంగా కర్నాటక – ముంబై జట్ల మధ్య కర్ణాటక వేదికగా జరిగిన మ్యాచులో 404 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ట్రోఫిలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. అండర్ – 19 క్రికెటర్ల కూచ్ బెహర్ ట్రోఫీ 2023-2024 ఫైనల్‌లో భాగంగా ముంబై-కర్ణాటక జట్లు తలపడ్డాయి. జనవరి 12న కేఎస్‌సీఏ నెవులే స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో ముంబయి 384 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టులో ప్రఖర్ చతుర్వేది హిస్టరిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 638 బంతులు ఎదుర్కొని 46 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. 404 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. కూచ్ బెహార్ ట్రోఫీ ఫైనల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ రికార్డు క్రియేట్ చేశారు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా కర్ణాటక తన తొలి ఇన్నింగ్స్‌ను 890 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇలా 18 ఏండ్లకే గ్రేట్ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా రికార్డు బ్రేక్ చేశారు ప్రఖర్.
undefined
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే మ్యాచ్‌లో, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ కూడా ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేసి 46 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అలాగే.. ఈ ఇన్నింగ్స్‌లో హర్షిల్ ధర్మాని రెండో సెంచరీ పూర్తి చేశాడు. 228 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. ప్రఖర్‌తో కలిసి రెండో వికెట్‌కు 290 పరుగుల భాగస్వామికి జోడించాడు.
ఛాంపియన్‌గా నిలిచిన కర్ణాటక
కర్ణాటక బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు ప్రఖార్ తప్ప మిగతా ఆటగాళ్లందరి ప్రదర్శన పేలవ ప్రదర్శనిచ్చారు. 404 పరుగులు చేసిన ప్రఖార్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 510 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు కర్ణాటక ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో ఇరు జట్లు డ్రాతో సరిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ సీజన్‌లో కూచ్ బెహార్ ట్రోఫీలో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన కర్ణాటక చాంపియన్‌గా అవతరించింది.