MS Dhoni : క్రికెట్ ల‌వ‌ర్స్ కు చెన్నై ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి.. ధోని రిటైర్మెంట్ కాబోతున్నాడా?

By Mahesh Rajamoni  |  First Published May 12, 2024, 6:38 PM IST

MS Dhoni IPL Career : చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న‌ ఒక పోస్ట్‌ను క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది. ఈ పోస్ట్ ముఖ్యంగా ఎంఎస్ ధోని అభిమానుల గుండెద‌డ‌ను మరింత పెంచింది.
 


MS Dhoni IPL Career : ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి హోమ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో చెపాక్ లో త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్ ఇరుజ‌ట్ల‌కు కీల‌కం. ప్లేఆఫ్ రేసులో నిల‌వాలంటే చెన్నై టీమ్ కు త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్. అయితే, ఈ మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో చేసిన ఒక పోస్టు వైర‌ల్ గా మారింది. ఈ పోస్టు క్రికెట్ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను పెంచ‌డంతో పాటు సీఎస్కే అభిమానుల గుండెద‌డ‌ను పెంచుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే.

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఖాతాలో పంచుకున్న‌ ఆ పోస్ట్‌లో 'మ్యాచ్ ముగిసిన త‌ర్వాత వెంట‌నే స్టేడియాన్ని వ‌ద‌లివెళ్ల‌కూడ‌ద‌ని కోరింది. ఒక ప్రత్యేకత విష‌యం మీ ముందుకు రాబోతోందని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ విష‌యం దేనికి సంబంధించింది అనేదానిపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. దీని గురించి ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న ధోని అభిమానులు ఇది ఎంఎస్ ధోనికి సంబంధించిన అంశం అయివుంటుంద‌ని పేర్కొంటున్నారు.

Latest Videos

ఇదే నా చివ‌రి ఐపీఎల్.. రోహిత్ శ‌ర్మ సంచ‌ల‌న వీడియో

ఎందుకంటే ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని ప్ర‌స్తుతం ఐపీఎల్ తో పాటు ప‌లు క్రికెట్ లీగ్ ల‌లో ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్ ప్రారంభానికి ముందు ధోని కెప్టెన్సీని వ‌దులుకుని చెన్నై బాధ్య‌త‌ల‌ను రుతురాజ్ గైక్వాడ్ కు అప్ప‌గించాడు. దీంతో ధోనికి ఇదే చివ‌రి ఐపీఎల్ అనే చ‌ర్చ మొద‌లైంది. తాజా పోస్టుతో ధోనీ సొంత మైదానంలో ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అవుతుందని జనాలు అనుకుంటున్నారు. ధోని ఐపీఎల్ కు వీడ్కోలు ప‌ల‌క‌నున్నాడ‌నీ, అందుకే సీఎస్కే ఈ పోస్టు చేసింద‌ని పేర్కొంటున‌నారు. ప‌లువురు సోష‌ల్ మీడియా యూజ‌ర్లు స్పందిస్తూ..  'ఖచ్చితంగా నేను ఈ రోజు ఏడుస్తాను' అని పేర్కొన్నాడు. మరొక వినియోగదారు.. 'సమ్ థింగ్ స్పెషల్ అంటే థాలా మరో సీజన్ ఆడుతున్నాడా?' అని పేర్కొన‌గా, మ‌రొక‌ర 'ఇది ఐపీఎల్ లో ఎంఎస్ ధోనికి చివరి మ్యాచ్ అవుతుందా?' అని కామెంట్స్ చేశాడు.

 

🚨🦁 Requesting the Superfans to Stay back after the game! 🦁🚨

Something special coming your way! 🙌🥳 🦁💛 pic.twitter.com/an16toRGvp

— Chennai Super Kings (@ChennaiIPL)

 

Thanks for This 💛https://t.co/G7YyScug9W

— 🎰 (@StanMSD)

 

టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన లెజెండ‌రీ ప్లేయ‌ర్ 

click me!