Champions Trophy 2025: స్టీవ్ స్మిత్.. కోహ్లీకి ముందే తెలుసా? వైర‌ల్ వీడియో

Published : Mar 05, 2025, 10:28 PM ISTUpdated : Mar 05, 2025, 10:29 PM IST
Champions Trophy 2025: స్టీవ్ స్మిత్.. కోహ్లీకి ముందే తెలుసా?  వైర‌ల్ వీడియో

సారాంశం

Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ వ‌న్డే కెరీర్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే, ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ - స్టీవ్ స్మిత్ వీడియో వైరల్ అవుతోంది. ఎందుకో తెలుసా?   

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి తర్వాత, ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ బిగ్ డిసిష‌న్ తీసుకున్నాడు. త‌న‌ వ‌న్డే క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు ప‌లికాడు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కార‌ణంగా దూరం కావ‌డంతో అత‌ని స్థానంలో స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. స్మిత్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం తెలిపింది.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజయం సాధించింది. మంగళవారం (మార్చి 5) దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 73 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 48.1 ఓవర్లలో 267 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 84 పరుగులతో భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు.

విరాట్ కోహ్లీ-స్టీవ్ స్మిత్ ల వైరల్ వీడియో

మ్యాచ్ తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేస్తున్నప్పుడు, విరాట్ కోహ్లీ-స్టీవ్ స్మిత్ ముఖాముఖికి వచ్చారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇద్దరు మాజీ కెప్టెన్లు ఒకరితో ఒకరు కొన్ని క్షణాలు మాట్లాడుకుని, ఆపై ఒకరినొకరు  హగ్ చేసుకున్నారు. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ చేతితో తాకి ఏదో అన్నాడు. స్మిత్ న‌వ్వుతూ క‌నిపించాడు. ఆ త‌ర్వాత‌ ఇద్దరూ ఒకరినొకరు హ‌గ్ చేసుకున్నారు.

వైరల్ వీడియోలో, విరాట్ కోహ్లీ స్మిత్‌ను చివరి మ్యాచ్? అని అడిగినట్లు.. దీనికి ఆస్ట్రేలియన్ లెజెండ్ 'అవును' అని బదులిచ్చిన‌ట్టు కామెంట్స్ వ‌స్తున్నాయి. కాగా, వ‌న్డేల‌కు మాత్ర‌మే తాను రిటైర్మెంట్ ఇచ్చిన‌ట్టు స్టీవ్ స్మిత్ తెలిపాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాన‌నీ, అలాగే, టీ20లలో ఆడటానికి అందుబాటులో ఉంటాన‌ని పేర్కొన్నాడు.

 
 

 

కాగా, 2010లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరఫున 170 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో అతను 43.28 సగటు, 86.96 స్ట్రైక్ రేట్‌తో 5800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2016లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ చేసిన 164 పరుగులు వన్డేల్లో అతని అత్యధిక స్కోరు. స్మిత్ వన్డేల్లో 28 వికెట్లు కూడా పడగొట్టాడు. ఆస్ట్రేలియా జట్టుకు 64 వన్డేలకు కెప్టెన్ గా ఉన్నాడు. అందులో కంగారూ జట్టు 32 గెలిచి 28 ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌లు ఫ‌లితం రాలేదు. 2015, 2023 వన్డే ప్రపంచ కప్ గెలిచిన కంగారూ జట్టులో స్టీవ్ స్మిత్ సభ్యుడుగా ఉన్నాడు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?