కేన్ విలియమ్సన్ సెంచరీ: సెమీఫైనల్లో పౌతాఫ్రికాపై కేన్ మామ విధ్వంసం

Published : Mar 05, 2025, 06:26 PM IST
కేన్ విలియమ్సన్ సెంచరీ: సెమీఫైనల్లో పౌతాఫ్రికాపై కేన్  మామ విధ్వంసం

సారాంశం

కేన్ విలియమ్సన్ సెంచరీ: రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై కేన్ విలియమ్సన్ సెంచరీ కొట్టేశాడు. తన వన్డే కెరీర్లో ఇది 15వ సెంచరీ.   

Kane Williamson century in Semi-final: సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో కేన్ విలియమ్సన్ అదిరిపోయే సెంచరీ బాదేశాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లో ఈ ఆటగాడు అదరగొట్టాడు. అంతకుముందు రచిన్ రవీంద్ర కూడా సెంచరీ కొట్టాడు. ఇద్దరూ కలిసి న్యూజిలాండ్‌ను పటిష్ట స్థితిలో నిలబెట్టారు. విలియమ్సన్ కెరీర్‌లో ఇది 15వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో అతని స్ట్రైక్ రేట్ కూడా సూపర్ గా ఉంది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ లు సెంచరీ చేయడంతో న్యూజీలాండ్ 362 పరుగులు చేసింది.

సెమీఫైనల్లో కేన్ విలియమ్సన్ సౌతాఫ్రికా బౌలర్లను చితక్కొట్టాడు. 94 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. 108.51 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ వల్ల న్యూజిలాండ్ మ్యాచ్‌లో గట్టి పొజిషన్‌లో ఉంది. కేన్ ఈ సెంచరీతో ఒక పెద్ద రికార్డు కూడా కొట్టాడు. దాని గురించి కూడా చూద్దాం.

కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు

కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 19000 పరుగులు చేసిన మొదటి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ అయ్యాడు. ఇప్పటివరకు ఏ కివీ ఆటగాడు ఈ రికార్డు కొట్టలేదు. ఈ విషయంలో స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను దాటేశాడు. సౌతాఫ్రికాపై కేవలం 27 పరుగులు చేయగానే ఈ రికార్డును అందుకున్నాడు.

వేగంగా 19000 పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్ కేన్

అంతేకాకుండా, వేగంగా 19000 పరుగుల మార్కును చేరుకున్న నాలుగో ఆటగాడిగా కూడా నిలిచాడు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అతను 399 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ 432 ఇన్నింగ్స్‌ల్లో 19 వేల పరుగులు చేశాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 433 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్కును అందుకున్నాడు. ఇప్పుడు విలియమ్సన్ కూడా ఈ లిస్టులో చేరాడు. జో రూట్ కూడా 444 ఇన్నింగ్స్‌ల్లో 19000 పరుగులు చేశాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే
IPL 2026 : దిమ్మతిరిగే ప్లాన్ తో ముంబై ఇండియన్స్.. ముంచెస్తారా !