విరాట్ కోహ్లి రెస్టారెంట్‌పై కేసు న‌మోదు.. ఏం జ‌రిగింది?

By Mahesh Rajamoni  |  First Published Jul 9, 2024, 12:09 PM IST

Virat Kohli Restaurant : భారత స్టార్ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్ పై కేసు న‌మోదైంది. బెంగ‌ళూరులోని కింగ్ కోహ్లీకి చెందిన వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. 
 


One8 Commune Restaurant and Pub : బెంగళూరులో ఉన్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వన్8 కమ్యూన్ రెస్టారెంట్ అండ్ పబ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతోనే ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ఆయా వ‌ర్గాలు పేర్కొన్నాయి. ప‌లు ఉల్లంఘ‌న‌ల‌తో పాటు నిర్ణీత సమయానికి మించి రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

కోహ్లీ రెస్టారెంట్‌పై ఎఫ్ఐఆర్

Latest Videos

కర్ణాటక ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, బార్లు, పబ్బులపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పోలీసులు జూలై 6వ తేదీ రాత్రి ప్రత్యేక డ్రైప్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే ప‌లు రెస్టారెంట్లు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న‌ట్టు గుర్తించాడు. కస్తూర్బా రోడ్‌లోని విరాట్ కోహ్లీ రెస్టారెంట్ వన్8 కమ్యూన్, చర్చి స్ట్రీట్‌లోని ఎంపైర్ రెస్టారెంట్, బ్రిగేడ్ రోడ్‌లోని పాంగియో బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్‌లపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్ణీత గడువు తర్వాత కూడా కస్టమర్లను వచ్చేందుకు అనుమతించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన‌ట్టు తెలిపారు.

రాత్రి ఒంటిగంట వ‌ర‌కు అనుమ‌తులు.. 

బెంగళూరులోని పబ్‌లు అర్ధరాత్రి 1 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమ‌తులు ఇచ్చింది ప్ర‌భుత్వం. దీని తరువాత రెస్టారెంట్‌లో తినడం, త్రాగడం లేదా సంగీతం ప్లే చేయడానికి అనుమ‌తించ‌రు. అయితే,  'కస్తూర్బా రోడ్‌లో ఉన్న One8 కమ్యూన్ పబ్ జూలై 6న తెల్లవారుజామున 1.20 గంటలకు వినియోగదారులకు సేవలందిస్తున్నట్లు గుర్తించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి అధిక స‌మ‌యం రెస్టారెంట్ ను తెరిచి వుంచినందుకు ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకున్నారు. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ తో పాటు మరో మూడు రెస్టారెంట్లు/పబ్‌లపై కూడా చర్యలు తీసుకున్నారు.

ABHISHEK SHARMA: ఇన్నింగ్స్ ప్రారంభం.. హాఫ్ సెంచ‌రీ.. సెంచ‌రీ.. అన్ని సిక్స‌ర్ల‌తోనే డీల్ చేశాడు !

click me!