ధోని రిటైర్మెంట్... వారి నిర్ణయమే ఫైనల్: గంగూలీ

By Arun Kumar PFirst Published Sep 17, 2019, 5:13 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. ధోని భవితవ్యం సెలెక్టర్లు, కెప్టెన్ కోహ్లీ చేతుల్లో వుందని గంగూలీ తెలిపారు.

టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని  రిటైర్మెంట్ పై  గతకొంతకాలంగా అభిమానుల్లో చర్చ సాగుతోంది. ప్రపంచ కప్ తర్వాత ఏ క్షణానయినా ధోని అంతర్జాతీయ క్రికెట్ కు  పూర్తిగా గుడ్ బై చెప్పనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. అలాగే ముగిసిన వెస్టిండిస్ పర్యటన, తాజాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న సీరిస్ లకు ధోని దూరమయ్యాడు. దీంతో ఈ ప్రచారం ఇటీవల మరీ ఎక్కువయ్యింది. 

ధోని రిటైర్మెంట్  పై కేవలం అభిమానుల్లోనే కాదు క్రికెట్ వర్గాల్లోనూ చర్చ జరుగేతోంది. మాజీలు, వ్యాఖ్యాతలతో పాటు ప్రస్తుత క్రికెటర్లు కూడా ధోని రిటైర్మెంట్ ప్రచారంపై వివిధ సందర్భాల్లో స్పందించారు. ఇలా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా పలుమార్లు దీనిపై మాట్లాడారు. తాజాగా మరోసారి ధోని రిటైర్మెంట్ పై ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

''ధోని భవితవ్యం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సెలెక్షన్ కమిటీ చేతుల్లో వుంది. వారే ధోనిని క్రికెటర్ గా కొనసాగించాలా, వద్దా అనేది నిర్ణయించేది. వారి ఆలోచనలకు తగ్గట్లుగానే ధోనీ నిర్ణయం వుంటుంది. అయితే ధోని రిటైర్మెంట్ పై వారి ఆలోచన ఎలా వుందో తనకయితే  తెలియదు.'' అని గంగూలీ పేర్కొన్నారు. 

ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సీరిస్ కు ధోనిని ఎంపిక చేయకపోవడంపై కూడా గంగూలీ స్పందించాడు. కోహ్లీతో పాటు టీమిండియా మేనేజ్ మెంట్ అతడి ధోని అవసరం లేదని  అనుకున్నట్లుంది. అందువల్లే అతడికి జట్టులో చోటు దక్కలేదంటూ గంగూలీ అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్...ధోనికి దక్కని చోటు

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కి ధోనీ దూరం.. కారణం ఇదేంనంటున్న ఎమ్మెస్కే

ఇండియా-సౌతాఫ్రికా టీ20 సీరిస్... ధోనిని పక్కనబెట్టాలన్నది కోహ్లీ ఆలోచనే: గంగూలీ

 

click me!