IPL 2024: రిషబ్ పంత్ పై రికీ పాంటింగ్ కామెంట్స్ వైర‌ల్

By Mahesh Rajamoni  |  First Published Mar 12, 2024, 1:44 PM IST

IPL  2024: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17  సీజ‌న్ (ఐపీఎల్ 2024) మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది బీసీసీఐ. ఎన్సీఏ నుంచి ఫిట్ నెస్ క్లియరెన్స్ పొందిన రిషబ్ పంత్ పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్ర‌ధాన కోచ్ రికీ పాంటింగ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.
 


Ricky Ponting's comments on Rishabh Pant : ఐపీఎల్ కొత్త సీజ‌న్ కు స‌ర్వం సిద్ద‌మ‌వుతోంది. భార‌త్ లో ప్ర‌తియేటా జ‌రిగే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ఈ సారి మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఐపీఎల్ 2024 కోసం అన్ని జట్లు ప్రస్తుతం తమ ఆటగాళ్లను ఒకచోట చేర్చుకుని ఇంటెన్సివ్ ట్రైనింగ్‌లో ఉన్నాయి.

చాలా కాలం త‌ర్వాత కారు ప్ర‌మాదం నుంచి కోలుకున్న భార‌త స్టార్ ప్లేయ‌ర్, వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ఆట‌ను చూడ‌టానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు. పంత్ డిసెంబర్ 2022 లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి, శస్త్రచికిత్స చేయించుకుని ఇటీవ‌లే కోలుకున్నాడు. గత ఒక సంవత్సరం పాటు ఎటువంటి మ్యాచ్‌లలో ఆడలేదు. ముఖ్య‌మైన గత సంవత్సరం 2023 టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐపీఎల్, వ‌న్డే ప్రపంచకప్ 2024 తో కూడిన 3 సిరీస్‌లలో పాల్గొనలేకపోయాడు. అయితే, ఇప్పుడు పంత్ పూర్తిగా కోలుకున్నాడు. ఐపీఎల్ కోసం ప్రాక్టిస్ కూడా  షురూ చేశాడు. బెంగ‌ళూరులోని ఎన్సీఏ కూడా ఫిట్ నెస్ క్లియ‌రెన్స్ ఇచ్చింది.

Latest Videos

IPL 2024: ధోని టీమ్ టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే.. ! ఐపీఎల్ టిక్కెట్ల బుకింగ్, ధ‌ర ఎంతో తెలుసా?

అయితే, కొంతకాలంగా ఎలాంటి మ్యాచ్‌లు ఆడని అతను కఠినమైన వికెట్ కీపింగ్ చేస్తాడా లేదా కెప్టెన్‌గా మాత్రమే ఆడతాడా లేదా సాధారణ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడతాడా అనేదానిపై స్ప‌ష్ట‌తలేక‌పోవ‌డంతో క్రికెట్ అభిమానుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ ప్ర‌ధాన కోచ్ రికీ పాంటింగ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. పాంటింగ్ మాట్లాడుతూ.. రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయ‌డానికి కసరత్తులు చేస్తున్నాడని తెలిపాడు. అలాగే, రాబోయే ఐపీఎల్ 2024 ను 100 శాతం ఖచ్చితంగా ఆడ‌తాడ‌ని తెలిపాడు. అయితే, పంత్ ను బ్యాట్స్‌మన్‌గా మాత్రమే ఆడించాలా? లేక కీపర్‌గా ఆడించాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని పాంటింగ్ వెల్ల‌డించాడు. 

"అది చాలా పెద్ద నిర్ణయం. మేము తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే పిట్ గా అందుబాటులో ఉంటే అతను నేరుగా కెప్టెన్సీలోకి వస్తాడని మీరు అనుకుంటారు. బహుశా పూర్తిగా ఫిట్‌గా లేకపోవచ్చు కానీ మేము అతనిని వేరే పాత్రలో ఉపయోగిస్తాము. ఖ‌చ్చితంగా మ్యాచ్ ఆడ‌తాడు. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. గత కొన్ని వారాలుగా కొన్ని ప్రాక్టీస్ గేమ్‌లు ఆడాడు. దీంతో పంత్ పై మాకు న‌మ్మ‌కం ఉంది" అని పాంటింగ్ పేర్కొన్నాడు. అలాగే, తన పాత ఫిట్‌నెస్‌ని తిరిగి పొందడానికి చాలా కష్టపడ్డాడనీ, ప్రాక్టీస్ మ్యాచ్ కీపింగ్ చేశాడని తెలిపాడు. మరో టోర్నీలో ఫీల్డర్‌గా శిక్షణ తీసుకున్న అతనికి బ్యాటింగ్ సమస్య కాదన్నాడు. గతేడాది పంత్ ఆడకపోవడం త‌మ‌కు పెద్ద నష్టమే జ‌రిగింద‌నీ, ఇప్పుడు ప్రపంచం మొత్తం అతని ఆటను చూడాలని ఎదురుచూస్తోందన్నాడు.

టీ20 నెంబ‌ర్.1 ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ ఎక్క‌డ‌? ఐపీఎల్ 2024 ఆడతాడా? లేదా

click me!