స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా

Published : Feb 17, 2023, 11:11 AM ISTUpdated : Feb 17, 2023, 11:28 AM IST
స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా

సారాంశం

Chetan Sharma: మూడు రోజుల క్రితం ఓ టీవీ న్యూస్ ఛానెల్  నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో  బీసీసీఐ రహస్యాలను బట్టబయలు చేసిన  చేతన్ శర్మ  తన పదవికి రాజీనామా చేశాడు. 

బీసీసీఐ చీఫ్ సెలక్టర్  చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశాడు.  మూడు రోజుల క్రితం   ‘జీ న్యూస్’, ‘వియాన్’ లు  కలిపి  నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో  బీసీసీఐ రహస్యాలు, కోహ్లీ - గంగూలీ మధ్య విభేదాలు, ఆటగాళ్ల ఫిట్నెస్,  టీ20లలో కొత్త కెప్టెన్, రోహిత్ - కోహ్లీ మధ్య ఇగోల  గురించి సంచలన విషయాలు వెల్లడించి అడ్డంగా దొరికిపోయిన  చేతన్ శర్మ తాజాగా  తన పదవికి రాజీనామా చేశాడు. 

స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్ తో  చేతన్ పై వేటు తప్పదనుకుంటున్న తరుణంలో.. తానే  రిజిగ్నేషన్ లెటర్ ను బీసీసీఐ  సెక్రటరీ  జై షాకు  మెయిల్ చేయగా ఆయన దానిని ఆమోదించినట్టు  ఎఎన్ఐ ఒక ట్వీట్ లో వెల్లడించింది. 

వాస్తవానికి  ఇది ‘ప్లాన్డ్ స్టింగ్’అని  చేతన్ కు జై షా మద్దతు తెలిపాడని   రెండ్రోజుల క్రితం వార్తలు వచ్చాయి.  ఇది కావాలని చేసిన పనేనని,  చేతన్ కు బోర్డు నుంచి మద్దతు దక్కిందని, అతడిని ఇప్పటికిప్పుడే  తన పదవి నుంచి తొలగించకపోవచ్చుననీ వార్తలు వెలువడ్డాయి.  అయితే చేతన్ చేసిన వ్యాఖ్యలపై అటు బోర్డు పెద్దలతో పాటు కింది స్థాయిలో ఉన్న వ్యక్తులు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు నోరు మెదపలేదు.  వీడియోలో చేతన్ లేవనెత్తిన అంశాలన్నీ భారత క్రికెట్ కు సంబంధించి చాలా సున్నితమైనవి కావడంతో  ఎవరూ ఈ వివాదం గురించి నోరు విప్పలేదు. మీడియాకూ దూరంగా ఉన్నారు. 

 

అయితే చేతన్ పై ఇప్పటికిప్పుడే వేటు తప్పకపోవచ్చునని,    దీనిపై  బీసీసీఐ అతడిని వివరణ అడగనున్నదని  బోర్డు వర్గాల ద్వారా తెలిసింది.  కానీ వివరణ  ఇవ్వడం కంటే ఇప్పటికే  తన వల్ల భారత క్రికెట్ పరువు పోయిందన్న   కారణమో మరేదో గానీ చేతన్ నేరుగా రాజీనామా వైపునకే మొగ్గు చూపారు. 

ఇదీ చదవండి : చేతన్ రచ్చ చేసెన్..! స్టింగ్ ఆపరేషన్ లో భారత క్రికెట్ సీక్రెట్స్ అన్నీ బట్టబయలు.. షాక్‌లో బీసీసీఐ

అసలేం జరిగింది..?  

మూడు రోజుల క్రితం   చేతన్.. జీ, వియాన్ లు కలిసి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో  రెండేండ్ల క్రితం భారత్ క్రికెట్ లో చిచ్చు రేపిన కోహ్లీ - గంగూలీ విభేదాలు,   కోహ్లీ వర్సెస్ బీసీసీఐ విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, గంగూలీకి మధ్య విభేదాలున్నాయని,  అతడు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు  దాదాతో పాటు బీసీసీఐ వారించినా విరాట్ వినలేదని, తాను బీసీసీఐ కంటే గొప్ప అని అనుకున్నాడని  చెప్పాడు. కోహ్లీ మీద కోపమే తప్ప రోహిత్ మీద ప్రేమ లేదని కూడా అన్నాడు.  భావి సారథి హార్ధిక్ పాండ్యానే అని   రివీల్ చేశాడు. అంతేగాక భారత క్రికెటర్లు  ఫిట్నెస్ కోసం ఇంజక్షన్లను తీసుకుంటారని, సీనియర్ క్రికెటర్లకు తిప్పలు తప్పవని  కూడా వివరించాడు.  ఇందుకు సంబంధించిన వీడియోలు భారత  క్రికెట్ ను ఓ కుదుపు కుదిపాయి. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !