IND vs AUS - Axar Patel superb catch : టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దుమ్మురేపగా, అక్షర్ పటేల్ ఫీల్డింగ్ లో అదరగొట్టి ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ దగ్గర ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి పట్టిన ఈ ఆశ్చర్యకరమైన క్యాచ్ ఈ ప్రపంచ కప్ లోనే బెస్ట్ క్యాచ్ గా నిలిచింది.
IND vs AUS - Axar Patel superb catch : టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8 మ్యాచ్ లో భారత జట్టు 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్ కు చేరుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొట్టి కంగారు జట్టుకు బిగ్ షాకిచ్చింది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్-కుల్దీప్ యాదవ్ అదరగొట్టారు. వీరికి తోడుగా అక్షర్ పటేట్ బంతితో తో పాటు ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. దీంతో భారత జట్టు అద్భుత విజయంతో టీ20 ప్రపంచ కప్ 2024 లో సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది.
సెయింట్ లూసియాలోని డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆసీస్ జట్టు లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు రాణించడంతో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. సూపర్ 8 గ్రూప్ 1లో వరుస విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు జూన్ 27న జరిగే సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.
undefined
టీ20 నెంబర్.1 ప్లేయర్ గా రోహిత్ శర్మ.. కోహ్లీని అధిగమిస్తూ రికార్డులు బద్దలు కొట్టాడు
అయితే, టీ20 ప్రపంచకప్ సూపర్-8 భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దుమ్మురేపగా, అక్షర్ పటేల్ ఫీల్డింగ్ లో అదరగొట్టి ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ దగ్గర ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి పట్టిన ఈ ఆశ్చర్యకరమైన క్యాచ్ ఈ ప్రపంచ కప్ లోనే బెస్ట్ క్యాచ్ గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అందించాడు. ఈ ఓవర్ చివరి బంతికి ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా.. కనెక్షన్ కుదరలేదు. దీంతో బౌండరీ లైన్ దగ్గర నిలబడిన అక్షర్ పటేల్ ఒక్కసారిగా అద్భుత క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఒక్క సారిగా మార్ష్ ఔట్ అయ్యాడంటే నమ్మలేకపోయాడు. అక్షర్ పటేల్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అందుకున్న ఈ క్యాచ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్ష్ 28 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు.
𝐀𝐗𝐀𝐑, 𝘮𝘶𝘫𝘩𝘦 𝘭𝘰𝘨 𝙎𝙪𝙥𝙚𝙧𝙢𝙖𝙣 𝘬𝘦𝘩𝘵𝘦 𝘩𝘢𝘪𝘯 💥
An incredible catch by to dismiss the Aussie skipper and provides a much-needed breakthrough in the 💪🏽
𝐒𝐔𝐏𝐄𝐑 𝟖 👉 | LIVE NOW |… pic.twitter.com/OOC5OkCymx
𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 🤯
Axar Patel's brilliant catch dismisses Mitchell Marsh 😎
Kuldeep Yadav with his match's first wicket👌
Follow The Match ▶️ https://t.co/L78hMho6Te | | | |
📸 ICC pic.twitter.com/pDwQ3gOAgp
24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ చేరిన టీమిండియా .. నెక్స్ట్ ఎవరితో తలపడనుంది?