9 వేల పరుగుల మైలు రాయి దాటిన రోహిత్ శర్మ

By telugu team  |  First Published Jan 20, 2020, 7:30 AM IST

వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలురాయి దాటిన బ్యాట్స్ మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ, డివీల్లీర్స్ వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు.


బెంగళూరు: వన్డేల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలు రాయి దాటిన మూడో బ్యాట్స్ మన్ గా టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు. ఆస్ట్రేలియాపై ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆయన ఈ మైలు రాయిని దాటేశాడు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు 9 వేల పరుగుల మైలు రాయిని దాటడానికి రోహిత్ శర్మకు నాలుగు పరగుల అవసరం ఉండింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో మొదటి ఓవరు చివరి బంతికి అతను ఆ నాలుగు పరుగులు సాధించాడు. 

Latest Videos

Also Read: బెంగళూరు వన్డే: ఏకపక్షం.. ఆసీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం, సిరీస్ కైవసం

దాంతో రోహిత్ శర్మ అత్యంత వేగంగా 9 వేల పరుగుల మైలు రాయి దాటిన విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డీవిలీర్స్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. విరాట్ కోహ్లీ 194 ఇన్నింగ్సుల్లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా, డీవిల్లీర్స్ 205 ఇన్నింగ్సుల్లో ఆ మైలు రాయి చేరుకున్నాడు.

రోహిత్ శర్మ 216 ఇన్నింగ్సుల్లో 9 వేల పరుగుల మైలురాయిని దాటాడు. సౌరవ్ గంగూలీ 228 ఇన్నింగ్సుల్లో ఆ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ 235, బ్రియాన్ లారా 239 ఇన్నింగ్సు తీసుకున్నారు.

Also Read: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా: ధోనీని దాటేసిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాపై జరిగిన మూడు వన్డేలో సిరీస్ ను భారత్ 2-1 స్కోరుతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ఈ మ్యాచులో సెంచరీతో చెలరేగిపోయాడు.

click me!