బెంగళూరులో ఇండియాపై మూడో వన్డేలో స్మిత్ చేసిన పొరపాటుతో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ రన్నవుటయ్యాడు. అవుటైన తర్వాత ఆగ్రహంతో తిట్టుకుంటూ ఫించ్ మైదానాన్ని వీడడం కనిపించింది.
బెంగళూరు: ఇండియాపై జరుగుతున్న మూడో వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ స్టీవ్ స్మిత్ చేసిన పొరపాటుకు రన్నవుటయ్యాడు. దాంతో ఫించ్ ఆగ్రహంతో మైదానాన్ని వీడాడు. భారీ స్కోరు చేసేలా కనిపించిన ఫించ్ స్టీవ్ స్మిత్ కారణంగా అవుటయ్యాడు.
మొహమ్మద్ షమీ బౌలింగులో బంతిని ఆఫ్ సైడ్ కు తరలించిన స్మిత్ పరుగు కోసం ముందుకు వచ్చాడు. అది చూసిన ఫించ్ వేగంగా స్ట్రైకింగ్ ఎండ్ లోకి వచ్చేందుకు పరుగు ప్రారంభించాడు. అయితే రవీంద్ర జడేజా బంతిని అందుకోగానే పరుగు తీయబోయిన స్మిత్ వెనక్కి వచ్చాడు.
undefined
Also Read: కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ చూశారా: కళ్లు చెదిరే రీతిలో డైవ్ కొట్టి...
అప్పటికే మూడొంతుల పరుగు పూర్తి చేసిన ఫించ్ ముందుకే పరుగు తీశాడు. కానీ, జడేజా వేసిన బంతి వికెట్లకు తగలలేదు. అయితే ఫించ్,త స్మిత్ ఒకే వైపు క్రీజులోకి వచ్చారు. ఆ సమయంలో తన వైపు వచ్చిన బంతిని శ్రేయాస్ అయ్యర్ అందుకుని దాన్ని బౌలింగ్ ఎండ్ లో ఉన్న షమీకి అందించాడు.
దాన్ని అందుకున్న షమీ వికెట్లను పడేశాడు. దాంతో ఫించ్ అవుటయ్యాడు. దాంతో ఫించ్ అసహనానికి గురయ్యాడు. అంతేకాకుండా కోపంతో తిట్టుకుంటూ మైదానాన్ని వీడాడు.
Also Read: బెంగళూరు వన్డే: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా