Team India : ఇషాన్ కిషన్ ప్రస్తుతం రంజీ మ్యాచ్ లను ఆడాలనీ, ఆ తర్వాతే టీమిండియాలోకి వస్తాడని ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు. తాజాగా ఇషాన్ కిషన్ సహా పలువురు యంగ్ ప్లేయర్లకు బీసీసీఐ వార్నింగ్ ఇస్తూ అల్టిమేటం జారీ చేసింది. తమ సూచనలు పాటించకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది.
India national cricket team: తమ సూచనలను పాటించకుండా తిరుగుతున్న ప్లేయర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గట్టి వార్నింగ్ ఇచ్చింది. వీరిలో ఇషాన్ కిషన్ తో పాటు కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, శ్రేయాస్ అయ్యర్‌లు సహా పలువురు ప్లేయర్లు ఉన్నారు. భారత జట్టులోకి వచ్చిన తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆయా ప్లేయర్లు భారత క్రికెట్ బోర్డు సూచనలు పాటించకపోవడంతో బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఇషాన్ కిషన్ విషయంలో పలు సూచనలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు.. టీమిండియాకు సమాచారం ఇవ్వకుండా తిరుగుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే బీసీసీఐ పలువురు ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చింది. టీం ఇండియాకు చెందిన పలువురు ఆటగాళ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి సందేశం పంపుతూ.. దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందేనని అల్టిమేటం విధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ కోసం పలువురు క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. ఇది బీసీసీఐ ఆగ్రహానికి కారణం అయింది. దీంతో ఐపీఎల్ ప్రారంభానికి ముందు ప్రాక్టిస్ సెషన్ లో పాల్గొంటున్న ఈ ప్లేయర్లు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడకుండా రాష్ట్ర జట్లలో పాల్గొనడం తప్పనిసరి చేసింది. తప్పనిసరిగా ఆయా రాష్ట్ర జట్లతో కలిసి రంజీ ట్రోఫీలో పాలుపంచుకోవాలని పేర్కొంది.
IND vs ENG : కేఎల్ రాహుల్ లేని లోటును దేవదత్ పడిక్కల్ భర్తీ చేస్తాడా..?
బీసీసీఐ వార్నింగ్ తో ఈ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ తర్వాతి రౌండ్ లో ఆడనున్నారు. ఇటీవల రంజీ క్రికెట్ ను బహిష్కరించామని పలువురు ఆటగాళ్లు చెప్పడంపై కూడా బీసీసీఐ గరంగరం అయింది. రంగంలోకి దిగిన బీసీసీఐ, జాతీయ సెలక్టర్లు గట్టి నిర్ణయం తీసుకున్నారు. చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. సోమవారం పలువురు ఆటగాళ్లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసిన ఈ ఆదేశాలు ప్రస్తుతం జాతీయ జట్టులో లేని లేదా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందని వారికి వర్తిస్తాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ ల కోసం ఆయా రాష్ట్ర జట్లతో ఈ ఆటగాళ్లు చేరాల్సి ఉంటుంది. ఆటగాళ్లు కేవలం అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకూడదనీ, దేశవాళీ క్రికెట్ కు కూడా ఆడాలనీ, ఆయా జట్లకు అందుబాటులో ఉండాలనీ, తమ రాష్ట్ర జట్ల పట్ల తమకున్న నిబద్ధతను గౌరవించాలని పేర్కొంది.
ఇషాన్ కిషన్ కు స్ట్రాంగ్ మెసేజ్..
ఈ నిబంధన అమలుతో పోటీ క్రికెట్ కు స్వస్తి పలికి ఐపీఎల్ కు సన్నద్ధమవుతున్న ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లపై ప్రభావం పడనుంది. ఇటీవల క్రిక్ బజ్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐపీఎల్ కోసం ప్రస్తుతం బరోడాలో శిక్షణ తీసుకుంటున్నాడు ఇషాన్ కిషన్. అతని సొంత జట్టు జార్ఖండ్ జంషెడ్ పూర్ లో రాజస్థాన్ తో ఆడాల్సి ఉంది. కానీ ద్రవిడ్ రంజీ మ్యాచ్ లను ఆడాలని చెప్పిన వినలేదు. అఆలగే, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్ కూడా రంజీ ఆడటం లేదు. ఇలా రంజీ మ్యాచ్ లలో ఆడని ప్లేయర్లకు బీసీసీఐ వార్నింగ్ మెయిల్స్ పంపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
భారత క్రికెటర్ కన్నుమూత.. ఎవరీ దత్తాజీరావు గైక్వాడ్..?