భార‌త క్రికెట‌ర్ క‌న్నుమూత‌.. ఎవ‌రీ దత్తాజీరావు గైక్వాడ్..?

By Mahesh Rajamoni  |  First Published Feb 13, 2024, 2:54 PM IST

Dattajirao Gaekwad: భారత టెస్టు క్రికెట్ దిగ్గజం దత్తాజీరావ్ గైక్వాడ్ (95) కన్నుమూశారు. దత్తాజీరావు గైక్వాడ్ 1948లో రంజీల్లో అరంగేట్రం చేసిన తర్వాత 1952 నుంచి 1961 వరకు భార‌త్ త‌ర‌ఫున ఆడారు.
 


Former India captain Dattajirao Gaikwad: భారతదేశపు అత్యంత వృద్ధ క్రికెట‌ర్, భారత టెస్టు క్రికెట్ దిగ్గజం దత్తాజీరావు గైక్వాడ్ క‌న్నుమూశారు. భారతదేశం తరపున సుదీర్ఘ‌కాలం ఆడిన ఈ క్రికెట‌ర్ మంగ‌ళ‌వారం ఉద‌యం 95 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. దేశ‌వాళీ క్రికెట్ తో పాటు భార‌త్ త‌ర‌ఫున 11 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడారు. తొమ్మిదేళ్ల పాటు సాగిన ద‌త్తాజీ రావు గైక్వాడ్  టెస్ట్ కెరీర్‌లో నాలుగు టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. 

భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ తండ్రి అయిన ద‌త్తాజీ గైక్వాడ్ గత 12 రోజులుగా బరోడా ఆసుపత్రిలోని ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతూ  మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రాణాలు కోల్పోయార‌ని భార‌త క్రికెట్ అసోసియేషన్ సంతాపం తెలుపుతూ ఒక ప్ర‌క‌ట‌నలో పేర్కొంది. 

Latest Videos

ఎవ‌రీ ద‌త్తాజీ రావు గైక్వాడ్..? 

జూన్ 1952లో ఇంగ్లాండ్ లో అరంగేట్రం చేసిన ద‌త్తాజీ రావు గైక్వాడ్.. 2016 మధ్యలో భారతదేశపు అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెట్‌గా గుర్తింపు పొందారు. పంకజ్ రాయ్, వికెట్ కీపర్-బ్యాటర్ మాధవ్ మంత్రి, విజయ్ మంజ్రేకర్‌లతో పాటు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్కోరు లేకుండా ఔటైన నలుగురిలో గైక్వాడ్ ఒకరు. 1953లో అతని వెస్టిండీస్ పర్యటన రెండో టెస్టులో క్యాచ్ కోసం వెళుతున్నప్పుడు విజయ్ హజారేతో ఢీకొనడంతో అతనికి భుజం గాయ‌మైంది.

1957-58లో, గైక్వాడ్ కెప్టెన్‌గా బరోడాకు తొమ్మిదేళ్లలో మొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. సర్వీసెస్‌తో జరిగిన ఫైనల్‌లో సెంచ‌రీ కొట్టాడు. రంజీ ట్రోఫీలో గైక్వాడ్ 1947 నుండి 1961 వరకు బరోడాకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 47.56 సగటుతో 3139 పరుగులు చేశాడు. 1959-60 సీజన్‌లో మహారాష్ట్రపై అజేయంగా 249 పరుగులు చేయడం గైక్వాడ్ కెరీర్ లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్. అహ్మదాబాద్‌లో 87 సంవత్సరాల వయస్సులో మాజీ బ్యాటర్ దీపక్ శోధన్ మరణం తర్వాత అతను 2016లో భారతదేశపు అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ అయ్యాడు.

గైక్వాడ్ తన ప్రారంభ క్రికెట్‌ను బాంబే విశ్వవిద్యాలయం, బరోడాలోని మహారాజా సాయాజీ విశ్వవిద్యాలయం త‌ర‌ఫున ఆడాడు. గైక్వాడ్ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సీకే నాయుడు సోదరుడు టెస్ట్ క్రికెటర్ సీఎస్ నాయుడు శిష్యుడు. 1948 లో బరోడా మహారాజా యువ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడానికి నియమించాడు. ఆ సమయంలో, గైక్వాడ్ వయస్సు 12 సంవత్సరాలు. బరోడాలో సీకే నాయుడు ప్రారంభించిన మొదటి అండర్ -14, అండర్ -16 క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు.

సీఎస్ నాయుడు నుండి లెగ్-స్పిన్, గూగ్లీ బౌలింగ్ వ్యూహాలను నేర్చుకున్న ద‌త్తాజీ రావు గైక్వాడ్, 1948 లో బొంబాయి విశ్వవిద్యాలయం (సమైక్య ప్రావిన్సులో భాగంగా) తరఫున రంజీ అరంగేట్రం చేసిన తరువాత 1952-1961 మధ్య 11 టెస్ట్ మ్యాచ్ ల‌లో భార‌త్ త‌ర‌ఫున ఆడాడు. గైక్వాడ్ మరణంపట్ల బీసీసీఐ  సంతాపం ప్రకటించింది. 

 

The BCCI expresses its profound grief at the passing away of Dattajirao Gaekwad, former India captain and India’s oldest Test cricketer. He played in 11 Tests and led the team during India’s Tour of England in 1959. Under his captaincy, Baroda also won the Ranji Trophy in the… pic.twitter.com/HSUArGrjDF

— BCCI (@BCCI)

 

 "మోతీబాగ్ క్రికెట్ గ్రౌండ్‌లోని మర్రిచెట్టు నీడ కింద, తన నీలిరంగు మారుతీ కారులో నుండి, భారత కెప్టెన్ డికె గైక్వాడ్ సార్ అవిశ్రాంతంగా బరోడా క్రికెట్ కోసం యువ ప్రతిభను కనబరిచి, మా జట్టు భవిష్యత్తును తీర్చిదిద్దాడు. క్రికెట్ సమాజానికి పెద్ద లోటు.. అత‌ను కోల్పోవ‌డం తీవ్ర బాధ‌ను క‌లిగిస్తోంది" అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

click me!