IND vs ENG : కేఎల్ రాహుల్ లేని లోటును దేవదత్ పడిక్కల్ భ‌ర్తీ చేస్తాడా..?

By Mahesh Rajamoni  |  First Published Feb 13, 2024, 1:34 PM IST

India vs England: భారత్-ఇంగ్లాండ్ మ‌ధ్య‌ మూడో టెస్టు మ్యాచ్ కు కేఎల్ రాహుల్ దూర‌మ‌య్యాడు. అత‌ని స్థానంలో ఇటీవ‌ల సెంచ‌రీల మోత మోగించిన దేవదత్ పడిక్కల్ కు టీమిండియాలో చోటు క‌ల్పించారు. 
 


IND vs ENG - Devdutt Padikkal: ఇంగ్లాండ్ తో మూడో టెస్టుకు ముందు భార‌త్ కు వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఈ సిరీస్ నుంచి పూర్తిగా త‌ప్పుకున్నాడు. ఇక ర‌వీంద్ర జ‌డేజా టీమ్ లో ఉన్న‌ప్ప‌టికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేద‌ని స‌మాచారం. అలాగే, స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ కేఎల్ రాహుల్ కూడా మోకాలి గాయం కార‌ణంగా రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో జ‌రిగే మూడో టెస్టుకు దూరంకావ‌డం భార‌త్ పెద్ద ఎదురుదెబ్బ‌. రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ కు చోటుద‌క్కింది. మ‌రి కేఎల్ రాహుల్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్ భ‌ర్తీ చేస్తాడా? రాహుల్ లోని లోటును క‌నిపించ‌కుండా చేస్తాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

 అయితే ఇటీవ‌ల అత‌ను ఆడిన మ్యాచ్ ల‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. వ‌రుస సెంచ‌రీల‌తో మోత మోగిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. దేశ‌వాళీ క్రికెట్ లో నిల‌క‌డ‌గా అడుతూ.. మంచి గ‌ణాంకాలు న‌మోదుచేస్తున్నాడు. 2022లో అనుకోని పేగు వ్యాధి కార‌ణంగా భారత క్రికెట్ తో స్టార్ గా ఎదుగుతున్న క్ర‌మంలో అత‌ని కెరీర్ కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఆస్ప‌త్రిపాలు కావ‌డంతో 2022 విజయ్ హజారే ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. ఐదు రంజీ ట్రోఫీ మ్యాచ్ ల‌ను ఆడి 260 పరుగులు మాత్రమే చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో కలిసి 261 పరుగులు చేశాడు. దేవధర్ ట్రోఫీ సమయంలో బొటనవేలు ఫ్రాక్చర్ మ‌రో దెబ్బ‌కొట్టింది. దీంతో ఆ  టోర్నమెంట్తో పాటు మహారాజా కెఎస్సిఏ టీ20 ట్రోఫీ రెండింటికి దూరం అయ్యాడు.

Latest Videos

4 బంతుల్లో 4 వికెట్లు.. భార‌త బౌల‌ర్ సంచ‌ల‌నం !

అనారోగ్యంతో కుంగిపోకుండా ప‌డిలేచిన కెర‌టంలా కోలుకుని క్రికెట్ గ్రౌండ్ లో అడుగుపెట్టిన దేవదత్ పడిక్కల్ 2023-2024 సీజన్ ను సరికొత్త ఆరంభానికి లక్ష్యంగా చేసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ అనుకున్న విధంగా రాణించ‌లేక‌పోయాడు కానీ, విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ ఐదు ఇన్నింగ్స్ ల‌లో 465 పరుగులతో కర్ణాటక టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ లో అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్నాడు. పంజాబ్ తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్ లో 193 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ తృటిలో డ‌బుల్ సెంచ‌రీ కోల్పోయాడు. మొత్తంగా ఆరు ఇన్నింగ్స్ ల‌లో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 

ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్-ఏ తరఫున 65, 21, 105 పరుగులు చేసి దేవదత్ పడిక్కల్ తన సత్తా చాటాడు. రెండో అనధికారిక టెస్టులో సౌతాఫ్రికాపై చేసిన సెంచరీ ఇన్నింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్-ఏ జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన అనుభవాన్ని దేవదత్ పడిక్కల్ గుర్తు చేసుకుంటూ.. దక్షిణాఫ్రికాలో గడిపిన సమయాన్ని విలువైన అనుభవంగా భావిస్తున్నాననీ, ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం లభించిందని తెలిపాడు. ఓపెనర్ నుంచి ప్రధానంగా టాప్ ఆర్డర్ ప్లేయ‌ర్ గా మారిన దేవదత్ పడిక్కల్.. 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల‌లో 44.54 యావరేజిని కలిగి ఉన్నాడు. రంజీలో అద‌ర‌గొట్టిన ఈ దేవదత్ పడిక్కల్  రానున్న టెస్టులో ఎలా రాణిస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది ! 

IND vs ENG : విరాట్ కోహ్లి లేడు.. ఇదే మంచి ఛాన్స్.. స్టువర్ట్ బ్రాడ్ కామెంట్స్ వైర‌ల్

click me!