అంతా తూచ్! రాహుల్ ద్రావిడ్‌కి హెడ్‌కోచ్ పదవిపై సస్పెన్స్... కోచ్ పదవులకి దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ..

By Chinthakindhi RamuFirst Published Oct 17, 2021, 3:39 PM IST
Highlights

భారత హెడ్‌కోచ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ... ఎన్‌సీఏ హెడ్ పొజిషన్‌కి కూడా...

భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడుపు, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీతో ముగియనుండడంతో అతని తర్వాత ఆ బాధ్యతను రాహుల్ ద్రావిడ్ తీసుకోబోతున్నాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు...

భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తాజాగా హెడ్‌కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ, ప్రకటన విడుదల చేసింది. భారత సీనియన్ మెన్ హెడ్ కోచ్ పదవితో పాటు బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌తో పాటు ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) హెడ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పోస్టులకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది బీసీసీఐ...

హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులు దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 26 కాగా, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఎన్‌సీఏ హెడ్ పొజిషన్ల కోసం నవంబర్ 3 వరకూ దరఖాస్తు సడ్మిట్ చేయడానికి సమయం ఇచ్చారు...

 

🚨 NEWS 🚨: BCCI invites Job Applications for Team India (Senior Men) and NCA

More Details 🔽

— BCCI (@BCCI)

హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వ్యక్తులు, కనీసం 30 టెస్టు మ్యాచులు లేదా 50 వన్డే మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. లేదా టెస్టులు ఆడే జట్టుకి కనీసం రెండేళ్ల పాటు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించి ఉండాలి. లేదా ఐపీఎల్ జట్టుకి, లేదా దానికి సమానమైన విదేశీ లీగ్‌కి కానీ, పస్ట్ క్లాస్ జట్లకి, జాతీయ ఏ జట్లకీ కనీసం మూడేళ్ల పాటు కోచ్‌గా వ్యవహరించి ఉండాలి...

అలాగే 60 ఏళ్లలోపు వయసుండాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ పదవులకి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 10 టెస్టు మ్యాచులు, 25 వన్డేలు ఆడిన అనుభవం ఉంటే సరిపోతుంది...

హెడ్ కోచ్ పొజిషన్‌కి రాహుల్ ద్రావిడ్ ఎంపిక ఖరారైపోయినా, ఆ సెలక్షన్‌ని బీసీసీఐ నియామక పద్ధతుల్లోనే ఇంటర్వ్యూ నిర్వహించి చేయబోతున్నారని సమాచారం. రాహుల్ ద్రావిడ్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే బాధ్యతలు తీసుకోబోతున్నారు.

అలాగే ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోడ్, ఆ పొజిషన్‌లో కొనసాగుతాడు. ఇక ఫీల్డింగ్ కోచ్ పొజిషన్‌లోనే ఎవరు నియమించబడతారనేదే ఆసక్తికరంగా మారింది. రాహుల్ ద్రావిడ్ రాజీనామా చేసిన ఎన్‌సీఏ హెడ్ పొజిషన్ కోసం కూడా కొత్త వ్యక్తిని వెతికే పనిలో పడింది బీసీసీఐ.

must read: వీడిన సస్పెన్స్, టీమిండియా తర్వాతి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... 2023 వన్డే వరల్డ్‌కప్ వరకూ...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా... IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

click me!