Shreyas Iyer : టీమిండియా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఎట్టకేలకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కకపోవడంతో పాటు టీ20 ప్రపంచ కప్ 2024 కోసం టీమిండియాలో చోటుదక్కకపోవడం పై నోరు విప్పాడు.
IPL 2024 title winner Shreyas Iyer: టీమిండియా స్టార్ ప్లేయర్, ఐపీఎల్ 2024 విజేత శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటుదక్కలేదు. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టులోనూ చోటుదక్కలేదు. అయితే, ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన ఈ ప్లేయర్ సెంట్రల్ కాంట్రాక్టు, టీమిండియా కు దూరంగా ఉంచడం పై ఎట్టకేలకు నోరు విప్పాడు. తోలి సారి బహిరంగంగా స్పందించాడు.
2023లో భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ తో అదరగొట్టాడు. 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. కానీ, 2024 ఆరంభం అంతగా కలిసి రాలేదు. మొదట అతను గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించింది. జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితిలో కుంగిపోకుండా తనను తాను నిరూపించుకుని ఐపీఎల్ 2024 లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు.
undefined
శ్రయాస్ అయ్యర్ ఏం చెప్పాడంటే..?
శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం, కొన్ని నిర్ణయాలు అనుకూలంగా లేకపోవడంపై బహిరంగంగా స్పందిస్తూ.. "నేను ప్రపంచ కప్‌లో మంచి ప్రదర్శన చేశాను.. ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. అయితే, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కొన్ని నిర్ణయాలు నాకు అనుకూలంగా రాలేదు. ఏదేమైనా చివరివరకు నా బ్యాట్ నా చేతుల్లో ఉంటుంది.. నేను ఎలా రాణిస్తానో అది నాపై ఆధారపడి ఉంటుందని" పేర్కొన్నాడు.
అలాగే, ''రంజీ ట్రోఫీ, ఐపీఎల్ గెలవడం గతంలో జరిగిన వాటికి బలమైన సమాధానం అని నేను నిర్ణయించుకున్నాను.. కృతజ్ఞతగా ప్రతిదీ నా మార్గంలో జరిగింది నేను అనుకున్న విషయాలు అనుకూలంగా జరిగాయని'' చెప్పాడు. అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సంవత్సరం ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మూడో సారి టైటిల్ ను సాధించింది.
T20 WORLD CUP 2024 : 12 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసిన కెనడా.. మరింత రసవత్తరంగా గ్రూప్ ఏ