T20 World Cup 2024 : 12 ప‌రుగుల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసిన కెన‌డా.. మరింత రసవత్తరంగా గ్రూప్ ఏ

By Mahesh Rajamoni  |  First Published Jun 8, 2024, 12:28 AM IST

Ireland vs Canada Highlights : టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్-ఏలోని ఐర్లాండ్ పై కెనడా 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్ లో విజయం సాధించిన 22వ జట్టుగా కెనడా నిలిచింది. 
 


Ireland vs Canada Highlights : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 13వ మ్యాచ్ లో గ్రూప్ ఏలోని జ‌ట్లు ఐర్లాండ్-కెన‌డాలు త‌ల‌ప‌డ్డాయి. ఐర్లాండ్ పై కెనడా 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాట‌ర్ల‌ను తెగ ఇబ్బంది పెడుతున్న న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ పై జ‌రిగిన ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 137 పరుగులు చేసింది. 

కెన‌డా ప్లేయ‌ర్ల‌లో నికోలస్ కిర్టన్ 49 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. అలాగే, శ్రేయాస్ మొవ్వ 37 ప‌రుగులు కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో క్రెయిగ్ యంగ్, బారీ మెక్‌కార్తీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 138 ప‌రుగుల టార్గెట్ తో ఛేద‌న‌కు దిగిన ఐర్లాండ్ ను కెన‌డా బౌల‌ర్లు షాకిచ్చారు. అద్భుత‌మైన బౌలింగ్ తో కెన‌డాను 125 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో జార్జ్ డాక్రెల్ (30 నాటౌట్), మార్క్ అడైర్ (34) ఏడో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ వారి ప్రయత్నం ఫలించలేదు.

Latest Videos

undefined

ఐర్లాండ్ ప్లేయ‌ర్ల‌లో జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్ త‌ప్పా మిగ‌తా  ఆట‌గాళ్లు పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. కెన‌డా బౌల‌ర్ల‌లో జెరెమీ గోర్డాన్, డిల్లాన్ హేలిగర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా, టీ20 ప్రపంచకప్‌లలో విజయం నమోదు చేసిన 22వ జట్టుగా కెనడా నిలిచింది. 2007 ఎడిషన్‌లో రెండు గేమ్‌లు ఆడిన కెన్యా, 2021 & 2024లో క‌లిపి ఐదు మ్యాచ్‌లు ఆడిన పీఎన్జీ మాత్రమే టోర్నమెంట్‌లో ఒక్క గేమ్‌ను కూడా గెలవలేకపోయాయి. టీ20 ప్రపంచ కప్‌లలో ఐర్లాండ్‌ను ఓడించిన 11వ జ‌ట్టుగా కూడా కెనడా నిలిచింది.

 

Canada WIN in New York! 🇨🇦

A superb bowling performance from them against Ireland sees them register their first Men's win 👏 | 📝: https://t.co/rYLPhX7ldC pic.twitter.com/axdtyEFrDg

— ICC (@ICC)

 

'ఇది యుద్ధం కాదు బాసు'.. భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ పై హార్దిక్ పాండ్యా ఏమ‌న్నాడంటే..? 

click me!