'ఇది యుద్ధం కాదు బాసు'.. భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ పై హార్దిక్ పాండ్యా ఏమ‌న్నాడంటే..?

By Mahesh Rajamoni  |  First Published Jun 7, 2024, 7:25 PM IST

IND vs PAK - Hardik Pandya : టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా జూన్‌ 9న భారత్‌-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. క్రికెట్ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ పై ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు చేస్తున్న కామెంట్స్ వైర‌ల్ గా మారుతున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశాడు. 
 


IND vs PAK - Hardik Pandya : భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీసులు ఆడ‌టం మానేసిన ఈ రెండు జ‌ట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్ర‌మే త‌ల‌ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో భాగంగా జూన్ 9న భారత్‌-పాకిస్థాన్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ఈ హైఓల్టేజీ మ్యాచ్ కు ముందు ఇరు జట్లకు చెందిన పలువురు క్రికెటర్లు చేస్తున్న కామెంట్స్ వైర‌ల్ గా మారుతున్నాయి.

తాజాగా భార‌త స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా  మారాయి. ఇది యుద్ధం కాదు బాసు.. ఈ మ్యాచ్ ఆడ‌టానికి చాలా ఆతృత‌గా ఉన్నాను అంటూ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను తాను 'యుద్ధం'గా చూడడం లేదనీ, అయితే తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు భారత ఆల్‌రౌండర్ ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు. ఇదివ‌ర‌కు జ‌రిగిన దాయాదుల పోరును గ‌మ‌నిస్తే  పాకిస్థాన్‌పై హార్దిక్ ప్రదర్శన అద్భుతంగా ఉంది.

Latest Videos

undefined

T20 WORLD CUP 2024 లో మ‌రో సూప‌ర్ విక్ట‌రీ.. పాకిస్తాన్ ను చిత్తుచేసిన అమెరికా

హార్దిక్ పాండ్యా 'స్టార్ స్పోర్ట్స్'తో మాట్లాడుతూ.. 'నేను పెద్ద మ్యాచ్‌లలో ఆడటం చాలా ఆనందంగా ఉంది. నాకు ఇది చాలా ప్రత్యేకమైనది. పాకిస్తాన్ జట్టుతో చాలా మ్యాచ్‌లలో నేను బాగా ఆడాను. రాబోయే మ్యాచ్ లోనూ అలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌తో చేయాల‌నుకుంటున్నాను. పాక్ పై విజ‌యం సాధిస్తామంటూ' పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా పాకిస్థాన్‌పై 6 టీ20 మ్యాచ్‌లు ఆడి 84 పరుగులు, 7.5 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు.

హార్దిక్ బీసీసీఐతో మాట్లాడుతూ, 'ఇది యుద్ధం కాదు, ఇది కేవలం మ్యాచ్. భారత్-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌లు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటాయి. అక్కడ భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, కానీ మేము క్రమశిక్షణతో కూడిన ఆట‌ను అందిస్తాము. జ‌ట్టుగా మా లక్ష్యాన్ని సాధిస్తామని నేను ఆశిస్తున్నానని" చెప్పారు.

భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ కు ముందే విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజం

click me!