తీసేసి, మళ్లీ పిలిచి... పరువు తీసుకున్న బీసీసీఐ! 3 నెలలుగా టీమిండియాలో హై డ్రామా...

Published : Feb 17, 2023, 12:11 PM IST
తీసేసి, మళ్లీ పిలిచి... పరువు తీసుకున్న బీసీసీఐ! 3 నెలలుగా టీమిండియాలో హై డ్రామా...

సారాంశం

నవంబర్ 2022న చేతన్ శర్మను చీఫ్ సెలక్టర్ పదవి నుంచి తప్పించిన బీసీసీఐ... జనవరి 2023లో తిరిగి చీఫ్ సెలక్టర్‌గా నియామకం... నెల తిరగకుండానే స్టింగ్ ఆపరేషన్‌లో ఇరుక్కుని, రాజీనామా.. 

భారత క్రికెట్‌ బోర్డులో హై డ్రామా రోజుకో ములుపు తిరుగుతోంది. స్టింగ్ ఆపరేషన్‌లో నోరు జారి, నోటికి వచ్చినంత వాగేసిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ, తన పొజిషన్‌కి రాజీనామా చేసేశాడు. ఏం జరిగింది? ఎందుకు ఇలా అడ్డమైన చెత్త వాగాల్సి వచ్చిందో చెప్పాల్సిందిగా బీసీసీఐ, చేతన్ శర్మకు మరో అవకాశం ఇచ్చినా... ఇంత జరిగాక ఏం చెప్పి కప్పి పుచ్చుకోవాలో తెలియక రాజీనామా ఇచ్చేశాడు చీఫ్ సెలక్టర్...

చేతన్ శర్మ రాజీనామా చేశాడని చెబుతున్నా, నిజానికి బీసీసీఐ పెద్దలే బలవంతంగా రాజీనామా ఇవ్వాలని హెచ్చరించి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే గత మూడు నెలల్లో టీమిండియాలో హై డ్రామా తారా స్థాయికి చేరింది...

అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయం తర్వాత పొట్టి ప్రపంచకప్‌కి సరైన టీమ్‌ని ఎంపిక చేయలేదనే విమర్శలు వచ్చాయి..

ఆ తర్వాత బంగ్లాదేశ్ టూర్‌లో వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడింది టీమిండియా. బంగ్లా వంటి పసికూన చేతుల్లో వన్డే సిరీస్ ఓడిపోయి, పరువు తీసుకుంది భారత జట్టు. ఈ రెండింటి ఎఫెక్ట్‌తో బీసీసీఐ, సెలక్షన్ కమిటీపై వేటు వేసింది. చేతన్ శర్మతో పాటు తన టీమ్ మొత్తాన్ని పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది...

అయితే పైరవీలే చేశాడో లేక తన పలుకుబడినే వాడాడో తెలీదు కానీ జనవరిలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా తిరిగి బాధ్యతల్లోకి వచ్చాడు చేతన్ శర్మ. సెలక్షన్ కమిటీ బాగోలేదని, వేటు వేసిన బీసీసీఐ.. మళ్లీ చీఫ్ సెలక్టర్‌గా చేతన్ శర్మనే ఎందుకు ఎంపిక చేసిందనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది...

స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన చేతన్ శర్మ, తాను తిరిగి బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎలా వచ్చాననే విషయాన్ని కూడా బయటపెట్టి ఉంటే... బీసీసీఐని నడిపిస్తున్న పెద్దల గుట్టు కూడా బయటపడేది. కానీ అలా జరగలేదు.. అయితే కొన్ని నెలలుగా భారత క్రికెట్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు మాత్రం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌ని బాధపెడుతున్నాయి...

జస్ప్రిత్ బుమ్రాని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన సెలక్టర్లు, మూడు రోజుల తర్వాత మనోడు ఇంకా కోలుకోలేదని తేల్చేసి తిరిగి అతన్ని జట్టు నుంచి తప్పించారు. స్టింగ్ ఆపరేషన్‌లో జస్ప్రిత్ బుమ్రా గురించి కూడా నోరు విప్పిన చేతన్ శర్మ, అతను బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడని అందుకే అతన్ని తప్పించామని చెప్పాడు...

ఇప్పుడు టీమిండియా, చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ వివాదం నుంచి బయటపడాలంటే అద్భుత విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాని చిత్తు చేసిన టీమిండియా, ఢిల్లీ టెస్టులో పర్యాటన టీమ్‌పై తిరుగులేని డామినేషన్ చూస్తే.. చేతన్ శర్మ వ్యవహారం మరుగున పడిపోతుంది. ఒకవేళ ఆసీస్, టీమిండియాపై డామినేషన్ చూపిస్తే... చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్‌లో వాగిన వాగుడుని మరింత హైలైట్ చేస్తారు నెటిజన్లు, ఆసీస్ మీడియా.. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !